PM Modi: దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని మోదీ

PM Modi: భారత వృద్ధిని చూసి కొందరు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని అయినా వాటిని పటాపంచలు చేస్తూ దేశాన్ని ప్రజలు వృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తున్నారు. భవిష్యత్తులో దేశ వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలని, అందుకోసం ఆత్మనిర్భర భారత్‌గా మారడం అత్యవసరం అన్నారుస్వదేశీ ఉత్పత్తులను..

PM Modi: దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని మోదీ
Pm Modi

Edited By:

Updated on: Sep 01, 2026 | 9:56 AM

PM Modi: 2026-27 తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) భారత్ 7.8 శాతం నమోదైనందుకు ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం దేశ ప్రజల సంకల్పం వల్లే సాధ్యమైందని అభినందనలు తెలిపారు. ప్రపంచంలో అనేక దేశాలు యుద్ధాలు, అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, సప్లై చైన్ దెబ్బతిన్నదని ,2020 కోవిడ్ నుంచి ఇప్పటివరకు ప్రపంచ దేశాలు స్థిరంగా లేవని గుర్తు చేశారు. అయినప్పటికీ భారత్ వేగంగా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు.

భారత వృద్ధిని చూసి కొందరు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని అయినా వాటిని పటాపంచలు చేస్తూ దేశాన్ని ప్రజలు వృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తున్నారు. భవిష్యత్తులో దేశ వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలని, అందుకోసం ఆత్మనిర్భర భారత్‌గా మారడం అత్యవసరం అన్నారుస్వదేశీ ఉత్పత్తులను వినియోగించాలని, వోకల్ ఫర్ లోకల్’గా మారాలని పిలుపునిచ్చారు. విదేశీ విహారయాత్రలకు వెళ్లకూడదని, విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోకూడదని సూచించారు.

మేడ్ ఇన్ ఇండియాగా మారాలన్నారు. అవసరం లేకపోతే బంగారం కూడా కొనుగోలు చేయవద్దని అన్నారు. ఆత్మనిర్భరతకు పెద్దపీట వేస్తే 2047 నాటికి భావితరాలకు వికసిత భారతం అందజేస్తామన్న నమ్మకం ఉందన్నారు. యువత ఆకాంక్షలు నెరవేర్చే దిశగా పనిచేయాలని, దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

 

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us