కరోనాతో దేశ మొదటి మహిళా కార్డియాలజిస్ట్‌ మృతి

| Edited By:

Aug 31, 2020 | 10:48 AM

దేశ మొదటి మహిళా కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌.ఎస్‌ఐ పద్మావతి(103) కరోనాతో కన్నుమూశారు. శనివారం రాత్రి పద్మావతి తుది శ్వాస విడిచినట్లు

కరోనాతో దేశ మొదటి మహిళా కార్డియాలజిస్ట్‌ మృతి
Follow us on

SI Padmavati passes away: దేశ మొదటి మహిళా కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌.ఎస్‌ఐ పద్మావతి(103) కరోనాతో కన్నుమూశారు. శనివారం రాత్రి పద్మావతి తుది శ్వాస విడిచినట్లు నేషనల్‌ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో డాక్టర్‌ ఓపీ యాదవ్‌ తెలిపారు. కరోనాతో ఆమె 11 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరగా.. కాలేయంలో ఇబ్బందుల తలెత్తడంతో ఆరోగ్యం క్షీణించింది. కాగా 1981లో నేషనల్‌ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌ని ప్రారంభించగా.. 2015 వరకు అక్కడే పనిచేశారు. ఈ క్రమంలో గాడ్‌మదర్‌ ఆఫ్‌ కార్డియాలజీగా అన్న పేరును ఘడించారు. కాగా ఆమె సేవలకు గానూ భారత ప్రభుత్వం 1967లో పద్మ భూషణ్‌, 1992లో పద్మ విభూషణ్‌లతో సత్కరించారు.

Read More:

ఆన్‌లైన్‌ క్లాసులు.. జైల్లో సంపాదించిన డబ్బులతో కూతురికి ఫోన్‌

‘దొంగ స్వామిజీ’గా చిరంజీవి..?