జడలు విప్పిన జాత్యహంకారం.. అమెరికాలో భారతీయ రెస్టారెంట్ పై దాడి

అమెరికాలో రేసిజం కరాళ నృత్యం చేస్తోంది. న్యూమెక్సికో లోని ‘ శాంటే ఫే సిటీ’ ప్రాంతంలో ఓ భారతీయ రెస్టారెంటుపై దుండగులు దాడి చేసి. గోడలపై ద్వేష పూరిత రాతలు రాశారు. ‘ఇండియా ప్యాలస్’ అనే ఈ రెస్టారెంట్ ను వారు నాశనం చేసినందువల్ల దీని యజమాని బల్జీత్ సింగ్ కి లక్ష డాలర్లకు పైగా నష్టం వాటిల్లింది. ఈ రెస్టారెంటులోని టేబుళ్లు, కుర్చీలను దుండగులు ధ్వంసం చేశారని, దేవతా విగ్రహం తలను పగులగొట్టారని, కంప్యూటర్లు దోపిడీ […]

  • Umakanth Rao
  • Publish Date - 5:41 pm, Wed, 24 June 20
జడలు విప్పిన జాత్యహంకారం.. అమెరికాలో భారతీయ రెస్టారెంట్ పై దాడి

అమెరికాలో రేసిజం కరాళ నృత్యం చేస్తోంది. న్యూమెక్సికో లోని ‘ శాంటే ఫే సిటీ’ ప్రాంతంలో ఓ భారతీయ రెస్టారెంటుపై దుండగులు దాడి చేసి. గోడలపై ద్వేష పూరిత రాతలు రాశారు. ‘ఇండియా ప్యాలస్’ అనే ఈ రెస్టారెంట్ ను వారు నాశనం చేసినందువల్ల దీని యజమాని బల్జీత్ సింగ్ కి లక్ష డాలర్లకు పైగా నష్టం వాటిల్లింది. ఈ రెస్టారెంటులోని టేబుళ్లు, కుర్చీలను దుండగులు ధ్వంసం చేశారని, దేవతా విగ్రహం తలను పగులగొట్టారని, కంప్యూటర్లు దోపిడీ చేశారని ఆయన వాపోయాడు. ‘వైట్ పవర్’, ట్రంప్ 2020, గో హోమ్ అనే నినాదాలే కాక.. అసభ్యపు రాతలు రాశారని, తనను చంపుతామని బెదిరిస్తూ హెచ్చరికలు చేశారని బల్జీత్ సింగ్ పేర్కొన్నారు. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఈ ప్రాంతంలో జాత్యహంకార ధోరణులు పెరిగిపోయాయన్నారు. ఇటీవలే కొలరాడోలో లఖ్వంత్ సింగ్ అనే మరో అమెరికన్ సిక్కు పైన కూడా ఓ శ్వేత జాతీయుడు తీవ్రంగా దాడి చేసి ఆయనను గాయపరిచాడు. ‘నీ దేశానికి వెళ్ళిపో’ అని కూడా ఆయనకు  అతడు వార్నింగ్ ఇఛ్చాడట.