Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఆ స్టేషన్‌లో దేశంలోనే తొలి పాడ్‌ హోటల్‌.. రేపు ప్రారంభం!

|

Nov 16, 2021 | 4:26 PM

Indian Railways: భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే రైల్వే వ్యవస్థనే. ప్రతినిధ్యం లక్షలాది మంది తమ తమ రైలు ప్రయాణం ద్వారా గమ్యస్థానాలకు చేరుకుంటారు...

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఆ స్టేషన్‌లో దేశంలోనే తొలి పాడ్‌ హోటల్‌.. రేపు ప్రారంభం!
Follow us on

Indian Railways: భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే రైల్వే వ్యవస్థనే. ప్రతినిధ్యం లక్షలాది మంది తమ తమ రైలు ప్రయాణం ద్వారా గమ్యస్థానాలకు చేరుకుంటారు. ఇతర రవాణా వ్యవస్థలకంటే రైళ్లలో తక్కువ ఛార్జీలు ఉంటాయి. అందుకే సామాన్యులు కూడా అధికంగా రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కూడా ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు ప్రత్యేక వసతులు కల్పిస్తుంటుంది. మెరుగైన సేవలు అందించే విధంగా రైల్వే స్టేషన్‌లలో ఎన్నో వసతులు కల్పిస్తోంది రైల్వే శాఖ. ఇక తాజాగా ముంబై సెంట్రల్‌లో ప్రయాణికుల కోసం అధునాథన ‘పాడ్‌ హోటల్‌’ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ హోటల్‌ బుధవారం ప్రారంభం కానుంది. భారతీయ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) శ్రీకారం చుట్టింది. స్టేషన్‌లోని మొదటి అంతస్తులో ఈ హోటల్‌ను నిర్మించింది. జపాన్‌ తరహాలో క్యా్ప్సుల్స్‌ హోటల్‌గా రూపొందించింది. ఇందులో ప్రయాణికులు రాత్రివేళల్లో బస చేసే విధంగా గదులను ఏర్పాటు చేశారు.

ఈ హోటల్‌లో బస చేసే ప్రయాణికులకు 12 గంటలకు రూ.999, 24 గంటలకు 1,999 ఛార్జీని నిర్ణయించింది. ఇక ప్రైవేటు కస్టమర్లకు 12 గంటలకు రూ.1,249, 24 గంటలకు రూ.2,499 నిర్ణయించారు రైల్వే అధికారులు. అలాగే ఈ హోటల్‌లో మహిళలు, వికలాంగుల కోసం ప్రత్యేక పాడ్‌లతో సహా 48 క్యాప్సూల్‌ లాంటి గదులను నిర్మించారు. హోటల్‌ ప్రాంగణంలో ఉచిత వైఫై సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఈ హోటల్‌ గదులలో ఏసీ, టెలివిజన్‌, మొబైల్‌ ఛార్జింగ్‌ పాయింట్‌, రీడింగ్‌ లైట్స్‌ మరెన్నో సదుపాయాలు ఉంటాయి. ఈ హోటల్‌ను రేపు రైల్వే శాఖ మంత్రి ప్రారంభించే అవకాశం ఉంది. ఈ హోటల్‌ నిర్మాణానికి ఐఆర్‌సీటీసీ 2018లో ప్రణాళికలు సిద్ధం చేసింది. భారతదేశంలో ఇలాంటి పాడ్‌ హోటల్‌ మొట్టమొదటిది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు సరికొత్త హోటల్‌ను నిర్మించారు. జపాన్‌ తరహాలో నిర్మించిన ఈ హోటల్‌లో ఎన్నో అత్యాధునిక సదుపాయాలను కల్పించారు.

ఇవి కూడా చదవండి:

SBI Loan: కస్టమర్లకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌.. నాలుగు క్లిక్స్‌తో వ్యక్తిగత రుణాలు.. వెంటనే అకౌంట్లోకి డబ్బులు..!

Jeevan Pramaan: పెన్షనర్లు అలర్ట్‌.. ఈనెల 30లోపు ఈ సర్టిఫికేట్‌ సమర్పించాలి.. లేకపోతే డబ్బులు రావు..!