Train: రైలు ప్రయాణం అంటే మీకు ఇష్టమా.. మన దేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఏమిటో తెలుసా..?

|

Aug 08, 2021 | 1:49 PM

Indian Railways: మనదేశంలో అతిపెద్ద రవాణా సంస్థ రైల్వే. ప్రతి రోజు ఎన్నో రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. కొన్ని రైళ్లు చాలా దూరం వెళ్తుంటాయి. అయితే మనదేశంలో ఎక్కువ దూరం..

Train: రైలు ప్రయాణం అంటే మీకు ఇష్టమా.. మన దేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఏమిటో తెలుసా..?
Follow us on

Indian Railways: మనదేశంలో అతిపెద్ద రవాణా సంస్థ రైల్వే. ప్రతి రోజు ఎన్నో రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. కొన్ని రైళ్లు చాలా దూరం వెళ్తుంటాయి. అయితే మనదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌. ఇది అస్సాంలోని దిబ్రూగఢ్‌ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు 4,273 కి.మీల దూరం ప్రయాణిస్తుంది. 9 రాష్ట్రాల మీదుగా ఈ రైలు ప్రయాణం కొనసాగుతుంది. ఈ రైలు మధ్య మధ్యలో 56 స్టేషన్‌లలో ఆగుతుంది. దిబ్రూగఢ్‌లో మొదలైన రైలు కన్యాకుమారి చేరడానికి ఐదు రోజులు పడుతుంది. ఇది వారంతపు రైలు మాత్రమే.

అయితే ప్రయాణికులు టూర్‌ వేసుకునేముందు ప్రత్యేకమైన ప్రదేశాలను ముందుగానే తెలుసుకోవడం బెటర్‌. ముఖ్యంగా అక్కడి ప్రత్యేకమైన వంటలు, పండ్లు, దొరికే వస్తువులను ఏ మాత్రం మిస్‌ కాకూడదు. టూర్‌లో ఉద్యం బ్రేక్‌ ఫాస్ట్‌ మాత్రం పూర్తి చేసుకోవడం మంచిది. అలాగే రోజు మొత్తంలో ఫుడ్‌ ఒకేసారి అధిక మోతాదులో తీసుకోకూడదు. కొద్దికొద్దిగా ఎక్కువ సార్లు తీసుకోవడం మంచిది. అలాగే ఫ్యామిలీ పరంగా టూర్‌ వెళ్లేవారు ముందుగా వైద్యున్ని సంప్రదించి మందులను వెంట తీసుకుని వెళ్లడం మంచిది. రైలు ప్రయాణం చేసే ముందు ముందుగానే స్టేషన్‌కు చేరుకోవడం మంచిది. అయితే ప్రతి రోజు కోట్లాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతుంది రైల్వే శాఖ. ప్రయాణికుల సౌకర్యార్థం రోజురోజుకు మరిన్ని సేవలను విస్తరిస్తూ వస్తోంది. రైళ్లలో అత్యాధునిక సదుపాయాలతో కొత్త కొత్త ట్రైన్లను అందుబాటులోకి తీసుకువస్తోంది.

ఇవీ కూడా చదవండి

Airtel: మీరు ఎయిర్‌టెల్‌ సిమ్‌ వాడుతున్నారా..? అయితే ఉచితంగా 4 లక్షల బెనిఫిట్స్‌.. ఎలాగంటే..!

LIC Policy Claim: ఎల్‌ఐసీ పాలసీదారుడు చనిపోయినట్లయితే.. డబ్బులను క్లెయిమ్‌ చేసుకోవడం ఎలా..?.. ప్రాసెస్‌ ఏమిటి?