Indian Railways: రైల్వే ప్రయాణికులకు పెద్ద ఉపశమనం.. కీలక ప్రకటన చేసిన ఇండియన్ రైల్వే శాఖ..!

Indian Railways: ప్రయాణికులకు భారీ ఊరటనిస్తూ భారత రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకటనతో ప్రయాణికులు టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో ఎదుర్కొనే..

Indian Railways: రైల్వే ప్రయాణికులకు పెద్ద ఉపశమనం.. కీలక ప్రకటన చేసిన ఇండియన్ రైల్వే శాఖ..!
Railway News
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 14, 2022 | 6:27 AM

Indian Railways: ప్రయాణికులకు భారీ ఊరటనిస్తూ భారత రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకటనతో ప్రయాణికులు టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో ఎదుర్కొనే సమస్యలకు చెక్ పడినట్లు అయ్యింది. ఇకపై ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు తాము వెళ్లాలనుకునే ప్రదేశానికి సంబంధించిన చిరునామాను నింపాల్సిన అవసరం లేదని రైల్వే డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రైలు టిక్కెట్లను బుక్ చేసేటప్పుడు IRCTC వెబ్‌సైట్, యాప్‌లో గమ్యస్థాన చిరునామాను పూరించడం తప్పనిసరి చేసింది. దాన్ని ఫిల్ చేయకుండా టికెట్ బుక్ చేయలేని పరిస్థితి ఉండేది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే, ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ తీసుకున్న తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులకు దీని నుంచి ఉపశమనం లభించనుంది.

కరోనా నిబంధనల ప్రకారం చిరునామాను పేర్కొనడం తప్పనిసరి.. దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న సమయంలో దానిని నియంత్రించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు కట్టుదిట్టమైన నివారణ చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగానే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు రైల్వే శాఖ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి సమయంలో కోవిడ్ పాజిటివ్ కేసులను ట్రాక్ చేయడం కోసం.. ప్రయాణికుల గమ్యస్థానం వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని ఇండియన్ రైల్వే ప్రకటించింది. ఆ నిబంధన ఇప్పటి వరకు కొనసాగగా.. తాజాగా ఆ నిబంధనను తొలగించింది. ప్రస్తుతం కొవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఇక కోవిడ్ ఆంక్షల్లో భాగంగా రైళ్లలో ఇచ్చే దిండు-దుప్పటి సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ సర్వీసును కూడా తిరిగి ప్రారంభించారు. రైళ్లలో రాత్రిపూట నిద్రపోవడానికి రైళ్లలో దిండ్లు, దుప్పట్లు అందిస్తున్నారు.

Also read:

Shocking Love Story: భర్తతో కలిసి జాతరకు వెళ్లిన భార్య మిస్సింగ్.. ఆ తరువాత మ్యాటర్ తెలిసి ఫ్యూజుల్ ఔట్..!

Kotak Mahindra Bank: ‘కొటాక్’ కస్టమర్లకు శుభవార్త.. ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను భారీగా పెంచిన బ్యాంక్..

Saleshwaram Festival: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భక్తులకు శుభవార్త.. రేపటి నుంచే సలేశ్వరం జాతర..

హైదరాబాద్‌లో అగ్నివీర్‌ నియామక ర్యాలీ.. దళారుల మాయలో పడొద్దు!
హైదరాబాద్‌లో అగ్నివీర్‌ నియామక ర్యాలీ.. దళారుల మాయలో పడొద్దు!
మంగళవారం ఈ 5 పనులు చేస్తే.. కోరుకున్న పనులు జరుగుతాయి..
మంగళవారం ఈ 5 పనులు చేస్తే.. కోరుకున్న పనులు జరుగుతాయి..
ఆదాయంలో దూసుకుపోతున్న పతంజలి..3 నెలల్లో ఎంత లాభం వచ్చిందో తెలుసా?
ఆదాయంలో దూసుకుపోతున్న పతంజలి..3 నెలల్లో ఎంత లాభం వచ్చిందో తెలుసా?
MBBS స్పెషల్‌ ‘స్ట్రే’ కౌన్సెలింగ్‌.. ఇవాళ మధ్యాహ్నం వరకే ఛాన్స్‌
MBBS స్పెషల్‌ ‘స్ట్రే’ కౌన్సెలింగ్‌.. ఇవాళ మధ్యాహ్నం వరకే ఛాన్స్‌
ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. ప్రధాని మోడీ విశాఖ పర్యటన రద్దు
ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. ప్రధాని మోడీ విశాఖ పర్యటన రద్దు
వెయ్యి రూపాయలు తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?
వెయ్యి రూపాయలు తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?
BSc (హానర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాల కౌన్సెలింగ్‌ రద్దు
BSc (హానర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాల కౌన్సెలింగ్‌ రద్దు
ఈరోజు ఉత్పన్న ఏకాదశి ఏ శుభసమయంలో విష్ణువును పూజించాలో తెలుసుకోండి
ఈరోజు ఉత్పన్న ఏకాదశి ఏ శుభసమయంలో విష్ణువును పూజించాలో తెలుసుకోండి
Horoscope Today: వారికి ఒకట్రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం..
Horoscope Today: వారికి ఒకట్రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం..
ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవన్.. ఎక్కడో కొడుతుంది సీనా..!
ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవన్.. ఎక్కడో కొడుతుంది సీనా..!