Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. జనరల్‌ టికెట్లు ఇక మరింత సులభంగా. పూర్తి వివరాలివే..

సాధారణంగా రైళ్లలో ప్రయాణించాలనుకునే వారు రిజర్వేషన్‌ టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటారనే విషయం తెలిసిందే. అయితే నాన్‌ రిజర్వ్‌ టికెట్లను కచ్చితంగా రైల్వే స్టేషన్‌లో ఉండే టికెట్‌ కౌంటర్‌ వద్దే తీసుకోవాల్సి ఉంటుంది. సహజంగానే ఈ కౌంటర్‌ల వద్ద భారీగా క్యూలైన్‌ ఉంటుంది. దీనికి చెక్‌ పెట్టడానికే..

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. జనరల్‌ టికెట్లు ఇక మరింత సులభంగా. పూర్తి వివరాలివే..
Indian Railway

Updated on: Nov 15, 2022 | 5:51 PM

సాధారణంగా రైళ్లలో ప్రయాణించాలనుకునే వారు రిజర్వేషన్‌ టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటారనే విషయం తెలిసిందే. అయితే నాన్‌ రిజర్వ్‌ టికెట్లను కచ్చితంగా రైల్వే స్టేషన్‌లో ఉండే టికెట్‌ కౌంటర్‌ వద్దే తీసుకోవాల్సి ఉంటుంది. సహజంగానే ఈ కౌంటర్‌ల వద్ద భారీగా క్యూలైన్‌ ఉంటుంది. దీనికి చెక్‌ పెట్టడానికే ఇండియన్‌ రైల్వే యూటీఎస్‌ మొబైల్‌ యాప్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. జనరల్‌ టికెట్లను స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌ ద్వారా బుక్‌ చేసుకునే అవకాశం కల్పించారు. అయితే ఇప్పటి వరకు ఈ పరిధి కేవలం 5 కి.మీలు మాత్రమే ఉంది.

అంటే రైల్వే స్టేషన్‌కు 5 కి.మీల పరిధిలో ఉంటేనే UTS మొబైల్‌ యాప్‌లో టికెట్లను బుక్‌ చేసుకునే అవకాశం ఉంది. కానీ తాజాగా రైల్వే అధికారులు ఈ పరిధిని 20 కిలోమీటర్లకు పెంచారు. దీంతో ప్రయాణికులు స్టేషన్‌కు 20 కి.మీల దూరం నుంచే టికెట్లను బుక్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ యాప్‌ ద్వారా ప్రయాణీకులు సాధారణ టికెట్లతో పాటు, నెలవారీ పాస్‌లు, ప్లాట్‌ఫామ్‌ టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ ద్వారా బుక్‌ చేసుకునేవచ్చు.

ఇంతకీ ఈ యాప్‌ ద్వారా టికెట్‌ను ఎలా బుక్‌ చేసుకోవాలంటే..

* ముందుగా స్మార్ట్‌ ఫోన్‌లో యూటీఎస్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

* అనంతరం బుకింట్‌ టికెట్‌పై క్లిక్‌ చేసి, జనరల్‌ బుకింగ్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి.

* అనంతరం మీరు బయలుదేరే స్టేషన్‌, గమ్యస్థానంతో పాటు ప్యాసింజర్‌ లేదా ఎక్స్‌ప్రెస్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి.

* చివరిగా ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించాలి. దీంతో స్క్రీన్‌పై మీకు టికెట్‌ ప్రత్యక్షమవుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..