
వేసవి కాలంలో రద్దీని తట్టుకునేందుకు అదనపు రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. దాదాపు 380 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు పేర్కొంది. దేశంలోని ఢిల్లీ, పట్నా, విశాఖపట్నం, మంబయి తదితర ప్రధాన నగరాల మీదుగా ఈ రైళ్లను ఏకంగా 6,369 ట్రిప్పులు నడపనున్నారు. అయితే గతేడాది మాత్రం 348 ప్రత్యేక రైళ్లు నడిపించారు. ఇవి మొత్తం కలిపి 4,599 ట్రిప్పులు నడిపినట్లు రైల్వేశాఖ తెలిపింది.
అయితే ఈసారి గత ఏడాది కంటే ఎక్కవ ట్రిప్పులు నడపనున్నారు. అంటే ఈ 380 ప్రత్యేక రైళ్లు దాదాపు 1,770 ట్రిప్పులు అదనంగా నడవనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు పట్నా – సికింద్రాబాద్, పట్నా – యశ్వంత్‌పుర్, విశాఖపట్నం – పూరి – హావ్‌డా వంటి తదితర మార్గాల్లో తిరుగుతాయి. అలాగే దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గతేడాది కంటే 80 ట్రిప్పులు అదనంగా 784 ట్రిప్పుల మేరకు ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం..