
Railways News: ఇంతకాలం రాళ్ల దాడులతో సతమతం అయిన రైల్వే అధికారులకు మరో కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఇప్పటి వరకు నడుస్తున్న రైళ్లపై రాళ్ల దాడులకు తెగబడిన దుండగులు.. ఇప్పడు మరో రీతిలో రెచ్చిపోతున్నారు. రైలు ప్రయాణాలకు అవాంతరాలు కలిగించేలా ట్రాక్‌లపై కంకర రాళ్లను వేస్తున్నారు. ఇటీవల ఒడ్డరహళ్లి స్టేషన్ సమీపంలో పట్టాల రాళ్లు వేయడంతో.. భువనేశ్వర్-కేఎస్ఆర్ బెంగళూరు ఎక్స్‌ప్రెస్ స్పెషల్ ట్రైన్(08463) దెబ్బతిన్నది. దాంతో ట్రైన్ అక్కడే నిలిచిపోయింది. అదృష్టావశాత్తు రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ ఇంజిన్‌ను ముందుగానే ఏర్పాటు చేశారు. దాంతో రైలు ఆలస్యంగా గ్యామానికి చేరుకుంది.
ఈ ఘటనపై రైల్వే అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రైల్వే చట్టంలోని సెక్షన్ 147, 154 కింద ఈ ఘటనలో ఒకరిపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. హెబ్బాల్-బానసవాడి మధ్య గత వారం రోజులుగా ప్రయాణిస్తున్ రైళ్లపై రాళ్లు రువ్వారు పలువురు దుండగులు. లొట్టెగొల్లహళ్లి-హెబ్బాల్ సమీపంలోని చన్నసంద్ర, తుమకూరు స్టేషన్ సమీపంలోనూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. రోజు రోజుకు అల్లరి మూకల అరాచకాలు పెరిగిపోతుండటంతో రైల్వే అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. రైల్వే ట్రాక్‌లపై రాళ్లు పెట్టడం, రాళ్లతో దాడి చేయడం వంటి చర్యలు ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదమే కాకుండా, తీవ్ర పరిణామాలు జరిగే అవకాశం ఉండటంతో అధికారులు ఇలాంటి వికృత చేష్టలు చేసే వారిపై ప్రత్యేక దృష్టి సారించారు.
దీనిపై సౌత్ వెస్ట్రన్ రైల్వేస్ జనరల్ మేనేజర్ సంజీవ్ కిషోర్ స్పందించారు. ఉద్దేశ పూర్వకంగా పాల్పడే ఈ వికృత చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి పనులను ప్రో యాక్టీవ్‌గా భావించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైల్వే ఆస్తి ప్రజల ఆస్తి అని, రైల్వేకు నష్టం జరిగితే జాతికి నష్టం అని ఆయన పేర్కొన్నారు. రైల్వేలకు సంబంధించి ఎవరైనా చిల్లర వేషాలు వేసినా.. రైలు భద్రతకు ముప్పు వాటిళ్లే చర్యలకు పాల్పడినా తక్షణమే సమాచారం అందించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు హెల్ప్‌లైన్ నెంబర్ 139 ను ప్రకటించారు సౌత్ వెస్ట్రన్ రైల్వేస్ జనరల్ మేనేజర్ సంజీవ్ కిషోర్.
Also read:
Dates Benefits: చలికాలంలో ఖర్జురాలు తింటే ఆరోగ్యానికి మంచిదేనా ? ప్రయోజనాలు తెలుసుకోండి..
Sea Ghost: హఠాత్తుగా సముద్రం మధ్యలో వింత ఆకారాలు.. భయంతో జనం పరుగు.. అసలు విషయం తెలిసి నవ్వులు