ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాన్ని అందించడానికి, వారికి ఉత్తమ సేవలను పెంపొందించేందుకు పద్ధతులు, నియమాలను సవరిస్తూనే ఉన్నాయి. అంతే కాకుండా ఎప్పటికప్పుడు కొత్త విధానాలను అందుబాటులోకి తీసుకువస్తుంటాయి. ఇప్పుడు ప్యాసింజర్స్ కోసం మరో కొత్త ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకువచ్చింది ఇండియన్ రైల్వే. ప్రయాణీకులు ప్రయాణం మధ్యలో వారి కోచ్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవడానికి వీలు కల్పించింది. ఉదాహరణకు.. స్లీపర్ కోచ్‌లో ప్రయాణిస్తున్నవారు.. తమ రిజర్వేషన్‌ను ఏసీ కోచ్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. నిత్యం మారుతున్న ప్రయాణికుల అవసరాలను తీర్చడమే రైల్వే లక్ష్యం. అందుకే భారతీయ రైల్వే అనేక టిక్కెట్ రిజర్వేషన్ నియమాలను చాలా సులభతరం చేసింది. ఇప్పుడు.. బుకింగ్ తర్వాత వారి కోచ్‌ని అప్‌గ్రేడ్ చేయడానికి ఈ సూతన విధానం ఉపయోగపడుతుంది. ఇప్పటికే తమ ప్రయాణాన్ని పొడిగించుకునే అవకాశం కల్పించగా.. కొంచెం అదనంగా రుసుము చెల్లించి తమ గమ్యాన్ని మార్చుకోవచ్చు.
భారతీయ రైల్వేలు అందించిన కొత్త సౌకర్యాన్ని పొందడానికి ప్రత్యేకంగా బూత్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. జర్నీ చేసే సమయంలో బెర్త్‌పైనే ఆ సౌకర్యాన్ని పొందవచ్చు. స్లీపర్ కోచ్‌లో ప్రయాణిస్తున్నప్పుడు వారు ఏసీ కోచ్‌లో ప్రయాణించాలనుకుంటే.. కంపార్ట్‌మెంట్‌లోని టీటీఈని సంప్రదించి, వివరాలు వెల్లడించాలి. ఉచిత బెర్త్ అందుబాటులో ఉంటే టీటీఈ ఏసీ కోచ్‌లో బెర్త్‌ను కేటాయిస్తారు. అప్‌గ్రేడ్ కోసం చెల్లించాల్సిన అదనపు రుసుము అప్‌గ్రేడ్ చేసిన కోచ్ కోసం రిజర్వేషన్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కోచ్‌లో బెర్త్ ఖాళీగా ఉంటేనే మీ కోచ్‌ను అప్‌గ్రేడ్ చేయడం సాధ్యమవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..