Trains Services: రైళ్ల పునరుద్ధరణపై రైల్వే శాఖ స్పష్టత ఇచ్చింది. ఏప్రిల్‌లో ప్రయాణికుల రైళ్లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నాయనే వార్తల్లో వాస్తవం లేదని వెల్లడించింది. అలాంటి తేదీలను తాము నిర్ణయించలేదని స్పష్టం చేసింది.
ప్రయాణికుల రైళ్లను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చే విషయంలో రైల్వేశాఖ క్లారిటీ ఇచ్చింది. అయితే రైళ్ల పునురుద్ధరణ మాత్రం దశలవారీగా ఉంటుందని వెల్లడించింది. ఇప్పటికే 65 శాతం రైళ్లు.. ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయని తెలిపింది.
దశలవారీగా రైళ్లను అందుబాటులోకి తెస్తున్నామని, అదే తరహాలో భవిష్యత్‌లో మిగిలిన రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించింది. కొవిడ్ నేపథ్యంలో రైళ్లన్నీ పూర్తిగా నిలిచిపోగా.. ప్రస్తుతం ప్రత్యేక రైళ్ల పేరిట కొన్ని రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.
भारतीय रेलवे द्वारा ऐसी कोई तारीख़ तय नही की गयी है, ज्ञात हो रेलवे द्वारा ट्रेनों की सेवाएँ क्रमबद्ध तरीके से बढ़ाई गयीं हैं।
निवेदन है अपुष्ट जानकारी प्रकाशित ना करें।https://t.co/lM90dox2e7 https://t.co/RDCYiMG8bc
— Spokesperson Railways (@SpokespersonIR) February 13, 2021
Big Breaking: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మీని బస్సును ఢీకొన్న లారీ.. 14 మంది మృతి
Double Pregnancy Woman: సైన్స్‌కే సవాల్.. గర్భంతో ఉన్న మహిళ మూడు వారాల తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ!