Social Media: ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో భారతీయ వినియోగదారుల డేటాను దుర్వినియోగం చేస్తున్నారనే వార్తలు రోజురోజుకు వస్తూనే ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను పర్యవేక్షించడానికి.. వారి ఏకపక్ష వైఖరిని నిరోధించడానికి నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని భారత పార్లమెంటరీ ప్యానెల్ సిఫార్సు చేసింది. ఇందులో భారతీయ ప్రెస్‌ను నియంత్రించే బాడీ వంటి కొత్త నియంత్రణ సంస్థను రూపొందించాలని ప్యానెల్ సూచించింది. అలాగే, ఈ నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీలకు 4% వరకు జరిమానా కూడా విధించవచ్చు.
2019లో ప్రవేశపెట్టిన పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును దృష్టిలో ఉంచుకుని ఒక రెగ్యులేటరీ బాడీని ఏర్పాటు చేయడం గురించి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అత్యున్నత స్థాయి కమిటీలా ఏర్పాటు చేయడం గురించి రెగ్యులేటరీ బాడీ మాట్లాడింది. ఇది గూగుల్ (Google) అమెజాన్(Amazon Inc) వంటి కంపెనీలు స్టోర్ చేసే డేటాను పూర్తిగా ఆపడానికి సహాయపడుతుంది. ఇండియన్ ప్రెస్‌ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎలా నియంత్రిస్తుందో, అదే విధంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల కోసం రెగ్యులేటరీ బాడీని ఏర్పాటు చేయాలని కమిటీ చెబుతోంది.
శీతాకాల సమావేశాల్లో బిల్లు..
నివేదికలోని సిఫార్సులను నవంబర్ 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు ప్యానెల్ హెడ్, భారతీయ జనతా పార్టీ మంత్రి పీపీ చౌదరి తెలిపారు. ఈ బిల్లులో పేర్కొన్న నిబంధనలను పాటించకపోతే, సోషల్ మీడియా కంపెనీల ప్రపంచ ఆదాయాల్లో 4% వరకు జరిమానా విధించే నిబంధన ఉండవచ్చు.
ఇవి కూడా చదవండి: Weight Loss: బరువు తగ్గాలని కడుపు మాడ్చుకుంటే ప్రయోజనం లేదు.. ఆహారాన్ని ఇలా తీసుకోవడం ద్వారా కూడా సన్నపడవచ్చు..
Mysterious Stone: బంగారం కోసం వెతికితే పెద్ద రాయి దొరికింది.. అదేమిటో తెలుసుకుని అవాక్కయ్యాడు!