Farmers Protest: ఆ రైతు సంఘాలు అలా అంటుంటే.. ఈ రైతు సంఘం ఇలా అంటోంది.. సుప్రీంకోర్టు స్పందన ఎలా ఉంటుందో?..
Farmers Protest: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వత్యిరేకిస్తూ దేశ వ్యాప్తంగా రైతు సంఘాలు తీవ్ర ఆందోళన చేస్తున్న
Farmers Protest: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వత్యిరేకిస్తూ దేశ వ్యాప్తంగా రైతు సంఘాలు తీవ్ర ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలల నుంచి దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నారు. అయితే తాజాగా రైతు చట్టాలపై యుద్ధం చేస్తున్న రైతుల్లో రెండో అభిప్రాయం బయటకొచ్చింది. రైతుల సమస్యల పరిష్కారానికై సుప్రీం కోర్టు నియమించిన కమిటీలో సభ్యులను మార్చాలంటూ మరో రైతు సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, దీనికి ముందు సుప్రీంకోర్టు నియమించిన కమిటీని రైతు సంఘాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయి. కమిటీలో సభ్యులెవరూ రైతు పక్షాన లేరని అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం తప్ప తమకేం అవసరం లేదని తేల్చి చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో భారతీయ కిసాన్ యూనియన్ లోక్‌శక్తి రైతు సంఘం.. మరో అభిప్రాయం వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఇంతకే భారతీయ కిసాన్ యూనియన్ లోక్‌శక్తి రైతు సంఘం ఏమందంటే.. కోర్టు నియమించిన ముగ్గురు సభ్యులను మార్చాలని కోరింది. ఆ కమిటీలో అందరికీ ఆమోద యోగ్యమైన సభ్యులను నియమించాలని విజ్ఞప్తి చేసింది. ఈ కమిటీలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలు, రైతు సంఘాల నేతలు, ఉద్యమ నాయకులను ఎంపిక చేయాలని కోరింది. ఈ కమిటీలో రాజకీయ నాయకులకు, పార్టీలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వొద్దని అభ్యర్థించింది. మరి సుప్రీంకోర్టు దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Also read:
పండక్కి సొంతూర్లకు వెళ్లిన జనం తిరిగి నగరానికి పయనం.. విజయవాడ-హైదరాబాద్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్