
సిక్కింలో శుక్రవారం నుంచి భారీగా కురుస్తున్న వర్షాలతో రోడ్లపై కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో దాదాపు 500 మంది పర్యాటకులు అక్కడే చిక్కుకున్నారు. వారు ఎటూ వెళ్లలేని పరిస్థితుల్లో చిక్కుకున్నారు. దీంతో సమాచారం తెలుసుకుని వెంటనే అప్రమత్తం అయిన సైన్యం చున్ తంగ్ వద్ద రోడ్డుపై చిక్కుకున్న వారిని రక్షించింది. మరోవైపు రోడ్లపై పడిపోయిన కొండ చరియలను తొలగించేందుకు కూడా చర్యలు తీసుకుంది. రోడ్డుపై చిక్కుకున్న వారిలో 216 మంది మహిళలు, 113 మంది మహిళలు, 54 మంది పిల్లలు ఉన్నారు. ఈ పర్యాటకులు లాచుంగ్ నుంచి లాచెన్ లోయ వైపు వెళుతున్నారు.
అయితే బాధితులను రక్షించి, మూడు స్థావరాలకు సురక్షితంగా తరలించామని రక్షణ శాఖ అధికారి తెలిపారు. వారికి భోజనం, దుస్తుల సౌకర్యం కల్పించామని తెలిపారు.అవసరమైన వారికి వైద్య సాయం కూడా అందించినట్లు పేర్కొన్నారు. అలాగే బాధిత పర్యాటకులకు వసతుల కల్పించేందుకు జవాన్లు సైతం తమ బ్యారక్ లను ఖాళీ చేశారని రక్షణశాఖ అధికార ప్రతినిధి వివరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి