భారత-చైనా మధ్య ఉద్రిక్తత…ఇక వైమానిక శ్రేణిలోకి రఫేల్ యుధ్ధ విమానాలు

చైనాతో తలెత్తిన ఉద్రిక్తత కారణంగా ఇండియా తన వైమానిక సత్తాను మరింత బలోపేతం చేయాలనుకుంటోంది. ఇందులో భాగంగా లడాఖ్ సరిహద్దుల్లో ఇదివరకే ఫైటర్లను, హెలీకాఫ్టర్లను, క్షిపణి వ్యవస్థలను మోహరించింది..

భారత-చైనా మధ్య ఉద్రిక్తత...ఇక వైమానిక శ్రేణిలోకి రఫేల్ యుధ్ధ విమానాలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 20, 2020 | 2:12 PM

చైనాతో తలెత్తిన ఉద్రిక్తత కారణంగా ఇండియా తన వైమానిక సత్తాను మరింత బలోపేతం చేయాలనుకుంటోంది. ఇందులో భాగంగా లడాఖ్ సరిహద్దుల్లో ఇదివరకే ఫైటర్లను, హెలీకాఫ్టర్లను, క్షిపణి వ్యవస్థలను మోహరించింది. అయితే ఇదే సమయంలో అత్యంత ఆధునిక 5 రఫేల్ యుద్ధ విమానాలను వైమానిక దళం ఈ నెల 29 న తన విమాన శ్రేణిలోకి చేర్చనుంది. రెండు సీట్లతో కూడిన మూడు విమానాలు, సింగిల్ సీటుతో ఉన్న రెండు విమానాలు ఆ రోజున అంబాలా ఎయిర్ బేస్ లో దిగనున్నాయి. ఈ ఫ్రెంచ్ ఆరిజిన్ ఫైటర్ల కోసం వైమానిక దళం రోడ్ మ్యాప్ ని కూడా రూపొందించబోతోంది. రఫేల్ విమానాలను ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకునేందుకు భారత ప్రభుత్వం ఇదివరకే ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. 59 వేల కోట్ల విలువైన 30 కి పైగా రఫేల్ ఫైటర్ల ‘రాక’ కోసం ప్రభుత్వం ఆతృతగా ఎదురు చూస్తోంది.

ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్.కె.భదౌరియా ఈ నెల 22-23 తేదీల్లో ఐ ఏ ఎఫ్ కమాండ్ల చీఫ్ లతో కమాండర్ల స్థాయిలో జరిగే కాన్ఫరెన్స్ కి అధ్యక్షత వహించి వారితో చర్చించనున్నారు. లడాఖ్ తూర్పు ప్రాంతంలో భారత-చైనా దళాలు  కొంత వెనక్కి వెళ్లినప్పటికీ..ఇంకా పూర్తి ఉపసంహరణ జరగవలసి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్న మన వైమానిక దళ ‘మోహరింపు’లో రఫేల్ ఫైటర్లు కూడా చేరిన పక్షంలో మనకు తిరుగు ఉండదని ఆయన వ్యాఖ్యానించారు.

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు