Operation Sindoor: ఆప‌రేష‌న్ సింధూర్ ఎఫెక్ట్.. చార్‌ధామ్‌ యాత్రకు బ్రేక్‌..! తిరిగి ఎప్పుడంటే..

యాత్ర ప్రారంభమైన 10 రోజుల్లోనే దాదాపు నాలుగున్నర లక్షల మంది యాత్రికులు నాలుగు ధామ్‌లను సందర్శించారు. బాబా కేదార్ ద్వారం వద్ద అత్యంత ఉత్సాహం కనిపిస్తోంది. ఇప్పటివరకు 1,87,954 మంది యాత్రికులు ఇక్కడ పూజలు చేశారు. ఈసారి చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ 30న యమునోత్రి మరియు గంగోత్రి ధామ్ తలుపులు తెరవడంతో ప్రారంభమైంది.

Operation Sindoor: ఆప‌రేష‌న్ సింధూర్ ఎఫెక్ట్.. చార్‌ధామ్‌ యాత్రకు బ్రేక్‌..! తిరిగి ఎప్పుడంటే..
Chardham Yatra 2025

Updated on: May 10, 2025 | 11:17 AM

భారత్‌-పాక్‌ సరిహద్దుల వద్ద తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో చార్‌ధామ్‌ యాత్ర నిలిపివేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్వర్వులు వచ్చే వరకు చార్‌ధామ్‌ యాత్రను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.హెలికాప్టర్‌ సేవలను కూడా నిలిపివేసింది. పాక్ దాడుల నేపథ్యంలో బద్రినాథ్‌, కేదార్‌నాథ్‌, గంగోత్రి, యమునోత్రిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. చార్‌ధామ్‌ యాత్ర జరిగే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భద్రతా బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు, కేంద్ర బలగాలు, రాష్ట్ర భద్రతా సిబ్బంది పెద్ద సంఖ్యలో మోహరించారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం చార్‌ధామ్‌ యాత్రను నిలిపివేసిన నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. తిరిగి యాత్రకు సంబంధించి అధికారిక ప్రకటనలు వచ్చే వరకూ కొత్తగా ప్రయాణాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. యాత్రను తిరిగి ప్రారంభించే తేదీపై ఇంకా స్పష్టత లేదని చెప్పారు. భారత్‌, పాక్‌ యుద్ధం నేపథ్యంలో పరిస్థితిని పరిశీలించి కేంద్రం తదుపరి నిర్ణయాలు తీసుకోనుంది.

యాత్ర ప్రారంభమైన 10 రోజుల్లోనే దాదాపు నాలుగున్నర లక్షల మంది యాత్రికులు నాలుగు ధామ్‌లను సందర్శించారు. బాబా కేదార్ ద్వారం వద్ద అత్యంత ఉత్సాహం కనిపిస్తోంది. ఇప్పటివరకు 1,87,954 మంది యాత్రికులు ఇక్కడ పూజలు చేశారు. ఈసారి చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ 30న యమునోత్రి మరియు గంగోత్రి ధామ్ తలుపులు తెరవడంతో ప్రారంభమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..