AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫత్హా-2 మిస్సైల్‌.. పాకిస్థాన్‌ సొంతంగా దీన్ని తయారు చేసుకుందా? అది ఎంత పవర్‌ఫుల్‌? పూర్తి వివరాలు

మే 9-10 తేదీల మధ్య రాత్రి పాకిస్తాన్ ప్రయోగించిన ఫత్హా-2 క్షిపణిని భారత రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది. పాకిస్తాన్ దాడులకు భారత సైన్యం ప్రతీకారం చేసింది. 400 కిలోమీటర్ల పరిధి కలిగిన హైపర్‌సోనిక్ బాలిస్టిక్ క్షిపణి అయిన ఫత్హా-2, చైనా సహాయంతో అభివృద్ధి చేయబడినట్లు సమాచారం.

ఫత్హా-2 మిస్సైల్‌.. పాకిస్థాన్‌ సొంతంగా దీన్ని తయారు చేసుకుందా? అది ఎంత పవర్‌ఫుల్‌? పూర్తి వివరాలు
Fatah 2 Missile
SN Pasha
|

Updated on: May 10, 2025 | 10:29 AM

Share

భారత్‌, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో మే 9-10 తేదీల మధ్య రాత్రి పాకిస్తాన్ ఫత్హా-2 క్షిపణులను ప్రయోగించింది. ఈ క్షిపణులను హర్యానాలోని సిర్సాలో భారత రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకొని నాశనం చేసింది. శుక్రవారం నుండి శనివారం వరకు రాత్రంతా అనేక భారతీయ నగరాలపై దాడులను కొనసాగిస్తూనే పాకిస్తాన్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. పాకిస్తాన్ రాత్రిపూట జరిపిన దాడులకు భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్, చక్వాల్‌లోని మురిద్ ఎయిర్‌బేస్, షోర్‌కోట్‌లోని రఫికి ఎయిర్‌బేస్ అనే మూడు వైమానిక దళ స్థావరాలపై భారత్‌ దాడి చేసినట్లు పాకిస్తాన్ పేర్కొంది. భారత్‌ చేసిన ఈ క్షిపణి దాడిలో పాకిస్తాన్‌లోని ఈ వైమానిక స్థావరాలు తీవ్రంగా ధ్వంసమైనట్లు సమాచారం. అయితే భారత్‌పై పాక్‌ ప్రయోగించిన ఫత్హా-2 గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఫత్హా-2 అనేది 400 కిలోమీటర్ల పరిధి కలిగిన హైపర్‌సోనిక్ బాలిస్టిక్ క్షిపణి. ఈ గైడెడ్ ఆర్టిలరీ రాకెట్ వ్యవస్థలు సైనిక స్థావరాలు, కమ్యూనికేషన్ సౌకర్యాలు, వాయు రక్షణ వ్యవస్థలు వంటి శత్రు భూభాగంలోని లోతైన అధిక-విలువ లక్ష్యాలపై కచ్చితమైన దాడుల కోసం రూపొందించారు. ఫత్హా-1 అధునాతన వెర్షనే ఈ ఫత్హా-2. అమెరికా HIMARS ప్రయోగించిన GMLRS లేదా చైనాకు చెందిన PHL సిరీస్ వ్యవస్థల వంటి ఆధునిక గైడెడ్ రాకెట్‌లతో సమానమైనదిగా దీన్ని పోల్చుతుంటారు.

అయితే పాకిస్తాన్ దీనిని స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన క్షిపణి అని చెప్పుకుంటూ ఉంటుంది. అయితే ఫత్హా-1 క్షిపణిని అభివృద్ధి చేయడంలో పాకిస్తాన్‌కు చైనా సహాయం చేసింది. అయినా పాక్‌ తామే తయారు చేసుకున్నామంటూ వాదిస్తూ ఉంటుంది. ఈ వాదన వెనుక ఉన్న నిజం ఎంత ఉందో ప్రపంచ సమాజానికి బాగా తెలుసు. ఫత్హా-2.. ఇది సాంప్రదాయ వార్‌హెడ్‌లను మోసుకెళ్లడానికి, మెరుగైన కచ్చితత్వంతో తక్కువ దూరం వద్ద లక్ష్యాలను ఛేదించడానికి రూపొందించారు. ఇది సైనిక స్థానాలు, రాడార్ కేంద్రాలు, లాజిస్టిక్స్ సౌకర్యాలను ఢీకొట్టడానికి వాడుతుంటారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..