Viral: తవ్వకాల్లో బయటపడ్డ భారీ సైజు గుడ్లు.. పరిశోధనలు చేయగా వెలుగులోకి సంచలన నిజం..

|

Jan 21, 2023 | 1:50 PM

భూమిపై జీవించిన అతిపెద్ద జంతువులు డైనోసర్లు. ఇవి మధ్యప్రదేశ్‌లోని థార్ జిల్లాలో నివసించినట్లు..

Viral: తవ్వకాల్లో బయటపడ్డ భారీ సైజు గుడ్లు.. పరిశోధనలు చేయగా వెలుగులోకి సంచలన నిజం..
Dinosar Eggs
Follow us on

భూమిపై జీవించిన అతిపెద్ద జంతువులు డైనోసర్లు. ఇవి మధ్యప్రదేశ్‌లోని థార్ జిల్లాలో నివసించినట్లు భారత పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటికి సంబంధించిన ఆధారాలను ఆ ప్రాంతంలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసర్ జాతికి చెందిన డైనోసర్ గుడ్లను కనుగొన్నారు. ఇప్పటివరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసర్ గుడ్ల ప్రపంచంలో మరెక్కడా దొరకలేదని అంటున్నారు. ఇక టైటానోసర్, డైనోసార్ గుడ్ల ఆనవాళ్లు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్, గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసర్, డైనోసర్లు పొడవైన మెడ, చిన్న తల, తోక కలిగి ఉంటాయి.

ఈ పురావస్తు శాస్తవేత్తలు 2017 నుంచి 2020 మధ్య థార్ చుట్టుప్రక్కల పలు ప్రదేశాల్లో తవ్వకాలు జరిపారు. తద్వారా 250 కంటే ఎక్కువ టైటానోసర్ గుడ్లతో పాటు హ్యచరీస్‌ను కనుగొన్నారు. ఈ మేరకు యూనివర్సిటీ అఫ్ ఢిల్లీకి చెందిన హర్ష దీమన్ తెలిపారు. ఇదే ప్రాంతంలో డైనోసర్ అవశేషాలను మొదటిగా 1928లో జబల్‌పూర్‌ దగ్గర గుర్తించనట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని సంవత్సరాల క్రితం డైనోసర్లు భారత భూభాగంలో నర్మదా నది చుట్టుప్రక్కల సంచరించినట్లు శాస్తవేత్తలు భావిస్తున్నారు. అలాగే గతంలోనూ గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయాల్లో డైనోసర్ అవశేషాలను కనుగొన్నారు శాస్తవేత్తలు. కాగా, ఈ తవ్వకాల్లో లభించిన అరుదైన గుడ్లు డైనోసర్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలు జరిపేందుకు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు.(Source)