జకీర్‌ని అప్పగించండి.. మలేషియాను కోరిన భారత్..!

వివాదాస్పద మత గురువు జకీర్‌ నాయక్‌ను అప్పగించాలని మలేషియా ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వం మరోసారి కోరింది. దీనిపై స్పందించిన మలేషియా వర్గాలు భారత్‌ చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తున్నట్టు తెలిపాయి.

జకీర్‌ని అప్పగించండి.. మలేషియాను కోరిన భారత్..!
Follow us

| Edited By:

Updated on: May 14, 2020 | 9:10 PM

వివాదాస్పద మత గురువు జకీర్‌ నాయక్‌ను అప్పగించాలని మలేషియా ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వం మరోసారి కోరింది. దీనిపై స్పందించిన మలేషియా వర్గాలు భారత్‌ చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తున్నట్టు తెలిపాయి. కాగా భారత్‌లో చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డ జకీర్.. ఇక్కడే ఉంటే అరెస్ట్‌ చేస్తారన్న భయంతో మలేషియాకు పారిపోయాడు. మూడేళ్లుగా అతడు అక్కడే ఉంటున్నాడు. ఇక గతేడాది ఈస్ట్‌ ఎకనామిక్‌ ఫోరంలో మలేషియా ప్రధాని మహథీర్‌ మహ్మద్‌ను కలిసిన నరేంద్ర మోదీ.. జకీర్‌ నాయక్‌ అప్పగింతపై మాట్లాడారు. నాయక్ అప్పగింతపై ఇరు దేశాల ప్రధానులు సమావేశంలో చర్చకు వచ్చినట్టు గతంలో భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే సైతం వెల్లడించారు. కాగా 2016 జూలైలో ఢాకాలోని హోలీ ఆర్టిసన్ బేకరేలో ఉగ్రదాడికి సంబంధించి కేసులో ఇటు భారత్‌, అటు బంగ్లాదేశ్‌లో జకీర్ దర్యాప్తును ఎదుర్కొంటున్నారు.

Read This Story Also: 3 నిమిషాల జూమ్‌ కాల్‌లో.. 3,700 మంది ఉద్యోగులపై వేటు..!