India Covid-19: దేశంలో 578కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. నిన్న కరోనా కేసులు ఎన్ని నమోదయ్యాయంటే?

|

Dec 27, 2021 | 9:48 AM

India Corona Updates: దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న క్రమంలో.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దడపుట్టిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకూ

India Covid-19: దేశంలో 578కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. నిన్న కరోనా కేసులు ఎన్ని నమోదయ్యాయంటే?
India Corona Cases
Follow us on

India Corona Updates: దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న క్రమంలో.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దడపుట్టిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. చూస్తుండగానే కేసుల సంఖ్య పదుల నుంచి వందలకు చేరింది. భారత్‌లో ఇప్పటివరకు 578 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో 17 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే.. ఇప్పటివరకు 151 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణలో ఉన్నాయి. ఢిల్లీ అత్యధికంగా 142 కేసులు ఉండగా.. మహారాష్ట్రలో 141 కేసులు ఉన్నాయి.

ఇదిలాఉంటే.. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. ఇటీవల కేసుల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే. రోజూ 10వేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నా.. పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో (ఆదివారం) దేశవ్యాప్తంగా 6,531 కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనా నుంచి 7,141 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 75,841 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అయితే.. దేశంలో రికవరీ రేటు 98.40 శాతానికి చేరింది. మార్చి తర్వాత రికవరీ రేటు భారీ స్థాయిలో పెరిగింది.

ఈ మహమ్మారి కారణంగా నిన్న 315 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మరణాల సంఖ్య 4,79,997 కి చేరింది. ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3,47,93,333 కి చేరగా.. కోలుకున్న వారి సంఖ్య 3,42,37,495కి పెరిగింది. కాగా.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 142 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
Also Read:

Viral Video: మ్యాజిక్ చూసి ఫిదా అయిన చింపాజీ.. రియాక్షన్ చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. వీడియో

Encounter: తెలంగాణ – ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టుల మృతి