India Covid-19: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. ఒమిక్రాన్ బాధితులు ఎంతమంది ఉన్నారంటే..?

|

Dec 22, 2021 | 9:51 AM

India Corona Updates: దేశంలో కరోనావైరస్ మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. ఇటీవల కేసుల సంఖ్య భారీగా తగ్గింది. రోజూ 10వేలకు తక్కువగా కేసులు

India Covid-19: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. ఒమిక్రాన్ బాధితులు ఎంతమంది ఉన్నారంటే..?
India Corona
Follow us on

India Corona Updates: దేశంలో కరోనావైరస్ మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. ఇటీవల కేసుల సంఖ్య భారీగా తగ్గింది. రోజూ 10వేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నా.. పెరుగుతున్న మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిన్న కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో (మంగళవారం) దేశవ్యాప్తంగా 6,317 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 318 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మార్చి తర్వాత రికవరీ రేటు గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం రికవరీ రేటు 98 శాతానికిపైగా ఉంది. ప్రస్తుతం దేశంలో 78,190 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 575 రోజుల తర్వాత క్రీయాశీల కేసుల సంఖ్య ఈ గణనీయంగా తగ్గినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా నిన్న కరోనా నుంచి 6,906 మంది బాధితులు కోలుకున్నారు.

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,42,01,966 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు ఈ మహమ్మారితో 4,78,325 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 138.95 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

213 కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. 
కాగా.. దేశంలో కోవిడ్‌ కొత్త వేరియంట్‌ విజృంభిస్తోంది. భారత్‌లో ఇప్పటివరకు 213 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. 15 రాష్ట్రాల్లో ఈ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కేసుల సంఖ్య భారీగా పెరిగింది. దేశంలో కొత్త వేరియంట్‌ కారణంగా ఇప్పటివరకు ఒక్కరు కూడా చనిపోలేదు. అయితే.. దేశంలో ఇప్పటివరకు అత్యధికంగా ఢిల్లీలో 57 కేసులు వెలుగులోకి రాగా.. మహారాష్ట్రలో 54, తెలంగాణ 24, కర్నాటక 19, రాజస్థాన్ 18, గుజరాత్ 14, కేసులు ఉన్నాయి. కాగా.. ఇప్పటివరకు 90 మంది బాధితులు కొత్త వేరియంట్ నుంచి కోలుకున్నారు.

Also Read:

అర్ధరాత్రి ఉలిక్కిపడిన బిల్డింగ్ వాసులు.. ఏడో అంతస్తు నుంచి నగ్నంగా కిందపడిన యువతి.. ఆ తర్వాత..

Crime News: ఇంట్లోకి వెళ్లకుండానే చనిపోయాడు.. లిఫ్ట్‌లో చిక్కుకొని బాలుడి దుర్మరణం.. అసలేమైందంటే..?