Coronavirus Updates: భారత్‌లో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు..

Covid-19 Cases in India: భారత్‌లో కరోనా ఉధృతి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌

Coronavirus Updates: భారత్‌లో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు..
India Corona

Updated on: Sep 09, 2021 | 10:05 AM

Covid-19 Cases in India: భారత్‌లో కరోనా ఉధృతి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. మళ్లీ పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో థర్డ్‌వేవ్‌ ప్రమాదం పొంచివుందని జాగ్రత్తలు పాటించాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో రోజువారీ కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 43,263 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. కరోనా మహమ్మారి కారణంగా 338 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

ఇదిలాఉంటే.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ 71 కోట్ల మార్క్ దాటింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 71,65,97,428 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. గడిచిన 24గంటల్లో 86,51,701 మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది.

Also Read:

Private Hospital: వామ్మో ఇంత బిల్లా..? ఢిల్లీలో కోవిడ్‌ రోగికి రూ.1.8కోట్ల బిల్లు.. చర్యలకు కాంగ్రెస్‌ డిమాండ్‌

Nipah Virus: కేరళలో కుదిపేస్తున్న నిఫా వైరస్.. సోకితే ప్రాణాలకే ముప్పు.. అసలు దీని లక్షణాలేంటి..?