Coronavirus Updates in India: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టినప్పటికీ.. కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కాగా.. నిన్న 44వేలకు పైగా నమోదైన కేసులు కాస్త.. భారీగా తగ్గుముఖం పట్టగా.. మరణాలు పెరిగాయి. తాజాగా.. 40 వేలకు దిగువన కేసులు నమోదు కాగా.. 600లకు పైగా మరణాలు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో (శుక్రవారం) దేశవ్యాప్తంగా 38,628 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 617 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,18,95,385 కి చేరగా.. మరణాల సంఖ్య 4,27,371 కి పెరిగింది.
ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా కరోనా నుంచి 40,017 మంది కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3,10,55,861 కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 4,12,153 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది.
కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ప్రారంభం నాటినుంచి ఇప్పటివరకు 50 కోట్ల మార్క్ దాటింది. ఇప్పటివరకు దేశంలో 50,10,09,609 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 49,55,138 వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు.
Also Read: