India Coronavirus: గుడ్‌న్యూస్.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. నిన్న మరణాలు ఎన్నంటే..?

|

Feb 14, 2022 | 9:41 AM

India Covid-19 Updates: దేశంలో కరోనావైరస్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. థర్డ్‌వేవ్ ప్రారంభంలో ఎన్నడూ లేని విధంగా రోజువారి కేసులు మూడు లక్షలకు పైగా నమోదైన విషయం తెలిసిందే.

India Coronavirus: గుడ్‌న్యూస్.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. నిన్న మరణాలు ఎన్నంటే..?
Follow us on

India Covid-19 Updates: దేశంలో కరోనావైరస్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. థర్డ్‌వేవ్ ప్రారంభంలో ఎన్నడూ లేని విధంగా రోజువారి కేసులు మూడు లక్షలకు పైగా నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం దేశంలో కరోనా (Coronavirus) కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో (ఆదివారం) కేసుల సంఖ్య భారీగా తగ్గింది. దేశవ్యాప్తంగా నిన్న 34,113 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 346 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 3.19 శాతంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ప్రస్తుతం దేశంలో 4,78,882 కేసులు యాక్టివ్‌గా (Active cases) ఉన్నాయి. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల 4,21,56,523 కి చేరగా.. ఇప్పటివరకు కరోనా నుంచి 5,09,011 బాధితులు ప్రాణాలు కోల్పోయారని కేంద్రం తెలిపింది.

కాగా.. నిన్న కరోనా (Covid-19) మహమ్మారి నుంచి 91,930 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,16,77,641 కి పెరిగింది. కాగా.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,72,95,87,490 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

Also Read:

Crime News: చదువుకునేందుకు బ్రిటన్ వెళ్లాడు.. పాడు పని చేయాలనుకున్నాడు.. చివరికి..

PM Narendra Modi: ఆ తర్వాత ఇప్పుడే పంజాబ్‌కు ప్రధాని మోదీ.. ఎన్నికల ర్యాలీలో కీలక ప్రసంగం..