India Covid-19: దేశంలో పెరుగుతున్న కరోనా మరణాలు.. నిన్న ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..

|

Jan 23, 2022 | 10:07 AM

India Coronavirus Updates: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజువారి కేసుల సంఖ్య మూడు

India Covid-19: దేశంలో పెరుగుతున్న కరోనా మరణాలు.. నిన్న ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..
Follow us on

India Coronavirus Updates: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజువారి కేసుల సంఖ్య మూడు లక్షలకుపైగా నమోదవుతున్నాయి. కాగా.. గడిచిన 24 గంటల్లో (శనివారం) కేసుల సంఖ్య కాస్త తగ్గర మరణాల సంఖ్య పెరిగింది. దేశవ్యాప్తంగా నిన్న 3,33,533 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 525 మంది మరణించారు. కాగా.. శుక్రవారంతో పోల్చుకుంటే..4,171 పాజిటివ్ కేసులు తగ్గాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా.. దేశంలో పాజిటివిటి రేటు గణనీయంగా పెరుగుతోంది. రోజూవారి పాజిటివిటీ రేటు 17.782% శాతం ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ప్రస్తుతం దేశంలో 21,87,205 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా నిన్న కరోనా నుంచి 2,59,168 మంది బాధితులు కోలుకున్నారు. తాజగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,92,37,264 కి చేరింది. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 4,89,409 మంది మరణించారు. ఇప్పటివరకు దేశంలో 3,65,60,650 మంది కోలుకున్నారనని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 93 శాతంగా ఉంది. కాగా.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 161.92 కోట్ల టీకా డోసులను (1,61,92,84,270) వేసినట్లు కేంద్రం తెలిపింది.

Also Read:

Viral Video: ఇద్దరు ఇద్దరే.. వేదికపై వధూవరులు చేసిన పనికి అందరూ షాక్.. నెట్టింట వీడియో వైరల్

Viral Video: పాముతో పోరాడిన ఎలుక.. పిల్లను కాపాడుకుని తరిమి.. తరిమి కొట్టింది..