India Coronavirus: గుడ్‌న్యూస్.. దేశంలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు.. కానీ..

|

Jan 28, 2022 | 9:44 AM

India Covid-19 Updates: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ వ్యాప్తి పెరుగుతుండటంతో అంతటా ఆందోళన

India Coronavirus: గుడ్‌న్యూస్.. దేశంలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు.. కానీ..
Follow us on

India Covid-19 Updates: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ వ్యాప్తి పెరుగుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజువారి కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. ఈ క్రమంలో కరోనా (Coronavirus) కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో (గురువారం) కేసుల సంఖ్య కాస్త తగ్గింది. దేశవ్యాప్తంగా నిన్న 2,51,209 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 627 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా.. దేశంలో పాజిటివిటి రేటు గణనీయంగా పెరుగుతోంది. రోజూవారి పాజిటివిటీ రేటు 15.88 శాతం ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా (Covid-19) మహమ్మారి నుంచి 3,47,443 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 21,05,611 కేసులు (5.18శాతం) యాక్టివ్‌గా (Active cases) ఉన్నాయి.

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 34,06,22,709 చేరగా.. మరణాల సంఖ్య 4,92,327 కి పెరిగింది. ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 3,3,80,24,771 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు దేశంలో 72,37,48,555 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

కాగా.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,64,44,73,216 టీకా డోసులను వేసినట్లు కేంద్రం తెలిపింది.


Also Read:

Goa Election 2022: నా పోరాటం కేవలం బీజేపీపైనే.. ఉత్పల్ పారికర్ కీలక వ్యాఖ్యలు..

Viral Photo: ఈ ఫోటోలోని ఈ చిన్నారి.. ఇప్పుడు ఓ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?