India Covid-19: భారత్‌లో కరోనా తాండవం.. తొలిసారిగా రెండు లక్షలకు చేరువలో రోజువారి కేసులు..

India Coronavirus Updates: దేశంలో కరోనా విజృంభిస్తోంది. కేవలం పదిరోజుల్లోనే మహమ్మారి కేసుల సంఖ్య ఏడు నెలల రికార్డును తుడిచిపెట్టేసింది. దేశంలో మొట్టమొదటి సారిగా

India Covid-19: భారత్‌లో కరోనా తాండవం.. తొలిసారిగా రెండు లక్షలకు చేరువలో రోజువారి కేసులు..
Coronavirus

Updated on: Jan 12, 2022 | 10:05 AM

India Coronavirus Updates: దేశంలో కరోనా విజృంభిస్తోంది. కేవలం పదిరోజుల్లోనే మహమ్మారి కేసుల సంఖ్య ఏడు నెలల రికార్డును తుడిచిపెట్టేసింది. దేశంలో మొట్టమొదటి సారిగా రోజూవారి కరోనా (Coronavirus) కేసులు లక్ష మార్క్‌ దాటి రెండు లక్షలకు చేరువలో నమోదయ్యాయి. ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండటంతో.. అంతటా ఆందోళన నెలకొంది. గడిచిన 24 గంటల్లో (మంగళవారం) దేశవ్యాప్తంగా 1,94,720 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 442 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ (Covid-19 Updates)ను విడుదల చేసింది. నిన్నటితో పోల్చుకుంటే.. కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఏకంగా 26,657 (15.8%) కేసులు పెరిగాయి. నిన్న కరోనా నుంచి 60,405 మంది కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 9,55,319 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా నిన్న కరోనా నుంచి 60,405 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో పాజిటివ్ రేటు 11.05 శాతానికి పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. ఇదిలాఉంటే దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో 4,868 మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకింది.

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,60,70,510 కి చేరింది. కోలుకున్న వారి సంఖ్య 3,46,30,536 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు ఈ మహమ్మారితో 4,84,655 మంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read:

Kodali Nani – Vangaveeti Radha: కొడాలి నాని, వంగవీటి రాధాకు కరోనా.. ఆస్పత్రిలో చేరిన ఇద్దరు నేతలు..

Sankranti Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి 200లకు పైగా స్పెషల్ ట్రైన్స్..