India Coronavirus Updates: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. కోవిడ్ థర్డ్‌వేవ్ అనంతరం రోజువారీ కరోనా కేసుల సంఖ్య వేయికి అటు ఇటుగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,007 కరోనా కేసులు (Covid-19) నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటి రేటు 0.23 శాతం ఉంది. దేశంలో ప్రస్తుతం11,058 (0.03) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నిన్న కరోనాతో ఒక్కరే ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. నిన్న కరోనా నుంచి 818 మంది కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,25,06,228 కి చేరింది.
తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల సంఖ్య 4,30,39,123 కి పెరిగాయి. ఈ మహమ్మారితో ఇప్పటివరకు 5,21,737 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 186.22 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
దేశ వ్యాప్తంగా నిన్న 4,34,877 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి ఇప్పటివరకు 83.08 కోట్ల పరీక్షలు చేసినట్లు వైద్యశాఖ వెల్లడించింది.
#Unite2FightCorona#LargestVaccineDrive
????? ?????https://t.co/xosnh3j1Gh pic.twitter.com/Kj9aBGg3jm
— Ministry of Health (@MoHFW_INDIA) April 14, 2022
Also Read: