India Coronavirus: గుడ్‌న్యూస్.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. నిన్న ఎన్నంటే..?

India Covid-19 Updates: దేశంలో కరోనా కేసులు భారీగా తుగ్గుతున్నాయి. కరోనా థర్డ్‌వేవ్ అనంతరం రోజువారి కేసుల సంఖ్య (Coronavirus) క్రమంగా తగ్గుతూ వస్తోంది.

India Coronavirus: గుడ్‌న్యూస్.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. నిన్న ఎన్నంటే..?
India Corona Cases

Updated on: Feb 21, 2022 | 9:57 AM

India Covid-19 Updates: దేశంలో కరోనా కేసులు భారీగా తుగ్గుతున్నాయి. కరోనా థర్డ్‌వేవ్ అనంతరం రోజువారి కేసుల సంఖ్య (Coronavirus) క్రమంగా తగ్గుతూ వస్తోంది. గతన కొన్ని రోజులుగా కేసుల సంఖ్య 20 వేలకు దిగువన నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో (ఆదివారం) దేశవ్యాప్తంగా నిన్న 16,051 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 206 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్నటితోపోల్చుకుంటే.. కేసుల సంఖ్య, మరణాల సంఖ్య భారీగా తగ్గింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 1.93 శాతంగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. దేశంలో 2,02,131 కేసులు (0.47%) యాక్టివ్‌గా (Active cases) ఉన్నాయి. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల 4,21,02,434 కి చేరగా.. ఇప్పటివరకు కరోనా నుంచి 5,12,109 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారని కేంద్రం వెల్లడించింది.

కాగా.. నిన్న కరోనా (Covid-19) మహమ్మారి నుంచి 37,901 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,21,24,284 కి పెరిగింది. కాగా.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,75,46,25,710 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. గత 24 గంట్లో 7లక్షల 706 మందికి వ్యాక్సిన్ డోసులను అందించినట్లు కేంద్రం పేర్కొంది.

Also Read:

Goutham Reddy Death Live Updates: పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం

Minister Goutham Reddy: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో కన్నుమూత