ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అమ్ముల పొదిలో మరో అధునాతన అస్త్రం చేరింది. ఎక్కడ దాగినా వెంటాడే స్పైక్ మిస్సైల్స్ ఇజ్రాయెల్ నుంచి భారత్‌కు వచ్చాయి. పర్వతాల చాటున నక్కి దాడులు చేసే శత్రువుల పనిబట్టనున్నాయి. శత్రువులు ఎక్కడ, ఎలాంటి ప్రదేశాల్లో దాగున్నా.. ఎత్తైన పర్వతాల మాటున దాగినా సరే ఇక వారి భారత్ వారి పని పడుతుంది. ఇంకా చెప్పాలంటే ఇక నుంచి శత్రుదేశాల యుద్ధ టాంకులతో భారత్‌పై దాడులు చేయడం ఇక కుదరదు. ఎందుకంటే.. ఇజ్రాయెల్ తయారీ స్పైక్ క్షిపణులు ఇప్పుడు భారత్ అమ్ములపొది లోకి చేరాయి. పర్వతాల వెనకాల దాగి ఉన్న శత్రు మూకలను సైతం టార్గెట్‌చేసి ధ్వంసం చేయడమే ఈ క్షిపణుల ప్రత్యేకత. ఈ మిస్సైల్స్‌ను ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఇండియా కొనుగోలు చేసింది. దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ కూడా ఈ క్షిపణుల ద్వారా ఈజీగా దెబ్బతీయొచ్చు. ఈ మిస్సైల్స్ కొనుగోలు ద్వారా పర్వతాల వెనుక ఉన్న రహస్య శత్రు శిబిరాలను కూడా ధ్వంసం చేయడానికి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తన సామర్థ్యాలను మెరుగుపర్చుకుంది.
ఈ అధునాతన క్షిపణి 30 కిలోమీటర్లల పరిధిలోని టార్గెట్‌ను ఈజీగా కూల్చివేస్తుంది. ఇజ్రాయెల్ తన అత్యాధునిక స్పైక్ నాన్ లైన్ ఆఫ్ సైట్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ క్షిపణులను భారత వాయుసేనకు అందించింది. ఈ ఇజ్రాయెల్ స్పైక్ క్షిపణుల డెలివరీ ఇప్పటికే పూర్తి కాగా.. త్వరలోనే భారత రక్షణ శాఖ ప్రయోగాత్మకంగా పరిశీలించనుంది. అనంతరం వాటిని భారత వాయుసేనకు అప్పగిస్తారు.
గత రెండేళ్ల క్రితం చైనా భారత సరిహద్దు వెంబడి తన ఆర్మీని, ఆయుద్ధ సంపత్తిని పెంచింది. భారీగా ఆయుధాలను మోహరించిన నేపథ్యంలో చైనాను నిలువరించడం కోసం భారత్ కు తప్పని సరి. దీంతో స్పైక్ క్షిపణులు తప్పనిసరి అని భారత వాయుసేన అప్పుడే నిర్ణయించుకుంది. వెంటనే.. భారత ప్రభుత్వం ఈ క్షిపణుల కోసం ఆర్డర్ ఇచ్చింది. సుదూర లక్ష్యాలను కచ్చితంగా ఛేదించడానికి ఈ స్పైక్ మిస్సైల్స్ బాగా ఉపయోగపడతాయంటోంది ఎయిర్‌ఫోర్స్. ఇజ్రాయెల్ స్పైక్ క్షిపణులను రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎంఐ-17వీ5 హెలికాప్టర్లకు అమర్చనున్నారు. చైనా కు చెక్ పెట్టె దిశగా మరో అడుగు ముందుకేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..