క్యాన్సర్‌ను జయించిన 88 ఏళ్ల బాడీ బిల్డర్‌.. తరగని ఫిట్‌నెస్‌తో యూత్‌ సిగ్గుపడేలా ప్రాక్టీస్‌..

|

Nov 02, 2022 | 8:11 AM

బాడీ బిల్డింగ్ తర్వాత అమీర్ చంద్ బ్యాంకులో మేనేజర్‌గా పని చేయడం ప్రారంభించాడు. కానీ, ఉద్యోగం చేస్తున్న క్రమంలోనే 1984లో క్యాన్సర్‌ బారిన పడ్డాడు. క్యాన్సర్‌ అని తేలిన తర్వాత

క్యాన్సర్‌ను జయించిన 88 ఏళ్ల బాడీ బిల్డర్‌.. తరగని ఫిట్‌నెస్‌తో యూత్‌ సిగ్గుపడేలా ప్రాక్టీస్‌..
Bodybuilder
Follow us on

క్యాన్సర్ అనేది ప్రజల మనసుల్లో భయాన్ని కలిగిస్తుంది. అయితే 88 ఏళ్ల వయసులో కూడా క్యాన్సర్ వంటి తీవ్ర అనారోగ్యాన్ని అధిగమించి, పంజాబీ బాడీబిల్డర్ ఫిట్‌నెస్ యువతను సిగ్గుపడేలా చేసింది. ఈ వృద్ధ బాడీబిల్డర్ పేరు అమీర్ చంద్. ఇతడు పంజాబ్‌లోని లూథియానాకు చెందినవాడు. ఈ 88 ఏళ్ల బాడీబిల్డర్‌కు నటుడు అమీర్ ఖాన్ కూడా అభిమాని. ఈ బాడీబిల్డర్ క్యాన్సర్‌ను ఓడించి జీవిత యుద్ధంలో విజయం సాధించాడు. అమీర్ చంద్ 12 ఏళ్ల వయసులో బాడీ బిల్డింగ్ ప్రారంభించాడు. అమీర్ చంద్ కు నేటితో 88 ఏళ్లు. కానీ, నేటికీ ఫిట్‌నెస్‌ కోసం ఒక్కరోజు కూడా వ్యాయామం మిస్‌ చేసుకోలేదు. అందుకే ఈ వయసులో కూడా యువకులను సైతం తలదించుకునేలా ఫిట్‌నెస్‌తో ఉన్నాడు.  బాడీ బిల్డింగ్ తర్వాత అమీర్ చంద్ బ్యాంకులో మేనేజర్‌గా పని చేయడం ప్రారంభించాడు. కానీ, ఉద్యోగం చేస్తున్న క్రమంలోనే 1984లో క్యాన్సర్‌ బారిన పడ్డాడు. క్యాన్సర్‌ అని తేలిన తర్వాత ముంబై వచ్చి క్యాన్సర్‌ చికిత్స చేయించుకున్నాడు. చికిత్స తర్వాత, అమీర్ చంద్ నిజంగానే మృత్యువును ఓడించాడని చెప్పొచ్చు. చాలా క్లిష్టపరిస్థితుల నుంచి బయటికి వచ్చినా అమీర్ చంద్ ఏనాడు అధైర్యపడలేదు. క్యాన్సర్ నుండి కోలుకున్న తర్వాత, అతను బాడీ బిల్డింగ్‌ను తిరిగి ప్రారంభించాడు. మళ్లీ మిస్టర్ పంజాబ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.

ఈ విషయమై అమీర్‌చంద్‌ కుమారుడు వికాస్‌ మాట్లాడుతూ.. మా కుటుంబం శాఖాహారం.. నాన్నను క్యాన్సర్‌ చుట్టుముట్టినప్పటికీ.. జీవన్మరణ యుద్ధంలో గెలిచి మళ్లీ బాడీ బిల్డింగ్‌ చేయడం మొదలుపెట్టాడు.. తండ్రి బాటలోనే మా కుటుంబం కూడా కసరత్తు చేస్తుంది. ప్రతి రోజు రెండు గంటలు బాడీ బిల్డింగ్‌ కోసం కేటాయిస్తామని చెప్పారు.

అమీర్ చంద్ జూనియర్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌తో ప్రారంభించాడు. అతను తన తండ్రి నుండి ప్రేరణ పొందాడు. ఈ మేరకు అమీర్ చంద్ మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ మాంసం తినలేదని చెప్పారు. పాలు, పాల ఉత్పత్తులపై మాత్రమే సాధన చేసినట్టుగా చెప్పారు. తాను లాహోర్‌లో పుట్టానని, తన తాతను చూసి కుస్తీ నేర్చుకున్నానని చెప్పాడు. బాడీబిల్డింగ్‌లో వృత్తిని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. తన మొదటి విజయం తనకు ఐదు కిలోల బాదం, ఐదు రూపాయల బహుమానం అందుకున్నట్టుగా వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

నేటి తరం యువకులు కూడా బాడీబిల్డింగ్ పట్ల ఆసక్తి పెంచుకోవాలని చెప్పారు. అందుకోసం ప్రొటీన్లు, సాట్రైడ్‌ల వెంట పరుగెత్త కూడదని చెప్పారు..బదులుగా దేశీ, స్వచ్ఛమైన ఆహారాన్ని తినమని సూచించారు. బాదం, వాల్‌నట్, సోయాబీన్స్, పప్పు, వేరుశెనగ, పాలు, చీజ్ వంటివి తీసుకోవాలని సూచించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి