డబ్బుల కోసమే పాకిస్థాన్‌ యుద్ధానికి దిగిందా..? అప్పుల కుప్పగా మారుతున్న ఆగని కుట్రలు

పాకిస్తాన్‌లోని ఉగ్రవాద కార్యకలాపాల తర్వాత భారత్‌-పాకిస్తాన్‌ మధ్య తీవ్రమైన ఘర్షణ ఏర్పడింది. ఈ ఘర్షణ తరువాత, పాకిస్తాన్‌ ఐఎంఎఫ్‌ నుండి బిలియన్‌ డాలర్ల రుణం పొందింది. ఈ రుణం పొందడం వెనుక పాకిస్తాన్‌ ఆర్థిక సంక్షోభం మరియు దాని దీర్ఘకాలిక అప్పుల భారం కారణంగా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

డబ్బుల కోసమే పాకిస్థాన్‌ యుద్ధానికి దిగిందా..? అప్పుల కుప్పగా మారుతున్న ఆగని కుట్రలు
India Pakistan

Updated on: May 11, 2025 | 4:58 PM

పహల్గామ్‌లో ఏప్రిల్‌ 22న ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడి 26 మందిని చంపేశారు. ఆ తర్వాత భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టి పాకిస్థాన్‌, పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసింది. ఆ వెంటనే పాకిస్థాన్‌ భారత్‌పై సైనిక చర్యకు దిగింది. భారత్‌ వాళ్ల దాడిని అడ్డుకుంటూ, ప్రతి దాడి చేసింది. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. కానీ, ఉన్నపళంగా అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించి చర్చలు కోసం ముందుకొచ్చాయి. ఊహించని ఈ పరిమాణంతో అంతా షాక్‌ తిన్నారు. కాల్పుల విరమణ కంటే ముందు పాకిస్థాన్‌ ఐఎంఎఫ్‌ నుంచి రుణం కావాలని అభ్యర్థించింది. పాక్‌ అభ్యర్థన మేరకు ఐఎంఎఫ్‌ ఏకంగా బిలియన్‌ డాలర్ల ఫండ్‌ మంజూరు చేసింది. దీంతో.. పాకిస్థాన్‌ కేవలం అప్పులు కోసమే భారత్‌తో కయ్యానికి కాలు దువ్విందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వాళ్లకున్న ఆర్థిక పరిస్థితి చూసి అప్పులు పుట్టవు, కానీ, యుద్ధం అని కన్నీళ్లు పెట్టుకుంటే ఐఎంఎఫ్‌ లాంటి సంస్థలు జాలి పడి, లేదా పరోక్షంగా చైనా లాంటి దేశాల మద్దతు చేస్తాయనే పాక్‌ కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐఎంఎఫ్‌ పాకిస్తాన్‌కు బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్రకటించింది. కానీ పేద పాకిస్తాన్ ఎంత అప్పులు చేసిందో మీకు తెలుసా? ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మొత్తం రుణాన్ని 2 సంవత్సరాలలోపు తిరిగి చెల్లించాలి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మొత్తం అప్పుల ఆధారంగా నడుస్తోంది. 1958లో మొదటిసారిగా పాకిస్తాన్ బెయిలౌట్ కోసం తన చేతులను చాచింది. 24 సంవత్సరాల తర్వాత IMF నుండి రుణం తీసుకుంది.

ఇతర రుణాలు అన్ని కలిపి ప్రస్తుతం పాకిస్తాన్ 130 బిలియన్‌ డాలర్ల అప్పుల్లో కూరుకుపోయింది ఉంది. 2027 నాటికి ఈ మొత్తం తిరిగి చెల్లించాలి. అందులో 30 బిలియన్లను 2025 నాటికి, మిగిలిన అప్పును 2027 నాటికి తిరిగి చెల్లించాలని పాక్‌పై ఒత్తిడి ఉంది. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది. భారత్‌, పాకిస్తాన్ ఒక రోజు తేడాతో స్వాతంత్ర్యం పొందాయి. నేడు భారత్‌ ప్రపంచంలో తన ప్రత్యేక ఉనికిని ఏర్పరచుకుంది. అదే సమయంలో పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించడంలో చాలా బిజీగా ఉంది. దాని పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. నేడు పాక్‌ విదేశీ మారక నిల్వలు దారుణంగా పడిపోయాయి. బంగ్లాదేశ్ కంటే తక్కువగా ఉన్నాయి. పాకిస్తాన్ తన పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి విదేశీ నిధుల కోసం చేతులు చాస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..