మరోసారి పలు నగరాలపై పాక్ డ్రోన్ ఎటాక్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి గాయాలు !

భారత్- పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, పాకిస్తాన్ మరోసారి ఎల్‌వోసిపై కాల్పులు ప్రారంభించింది. జమ్మూలోని అనేక చోట్ల మళ్ళీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. రక్షణ వర్గాల సమాచారం ప్రకారం, జమ్మూ, సాంబా, పఠాన్‌కోట్ సెక్టార్లలో పాకిస్తాన్ డ్రోన్లు కనిపించాయి. పాకిస్తాన్ నుండి వచ్చిన క్షిపణి దాడిని గాల్లోనే ధ్వంసం చేసింది భారత ఆర్మీ.

మరోసారి పలు నగరాలపై పాక్ డ్రోన్ ఎటాక్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి గాయాలు !
Pakistan Army Drone Attack On Ferozepur

Updated on: May 09, 2025 | 11:34 PM

భారత్- పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, పాకిస్తాన్ మరోసారి ఎల్‌వోసిపై కాల్పులు ప్రారంభించింది. జమ్మూలోని అనేక చోట్ల మళ్ళీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. రక్షణ వర్గాల సమాచారం ప్రకారం, జమ్మూ, సాంబా, పఠాన్‌కోట్ సెక్టార్లలో పాకిస్తాన్ డ్రోన్లు కనిపించాయి. పఠాన్‌కోట్ సరిహద్దులోని ఫిరోజ్‌పూర్‌పై పాకిస్తాన్ నుండి వచ్చిన క్షిపణి దాడిని గాల్లోనే ధ్వంసం చేసింది భారత ఆర్మీ.

జైసల్మేర్‌లోని పోఖ్రాన్‌లో పాకిస్తాన్ వరుసగా రెండో రోజు డ్రోన్ దాడికి తెగబడింది. భారత సైన్యం డ్రోన్ దాడి ప్రయత్నాలను భగ్నం చేసింది. ఈ సమయంలో జైసల్మేర్ మొత్తం చీకటిలో ఉంది. రెండు పర్యాయాలలో పాకిస్థాన్‌కు నాలుగు డ్రోన్లు ఎగురుతూ కనిపించాయి. భారత వైమానిక రక్షణ వ్యవస్థ పాకిస్తానీ డ్రోన్‌ను కూల్చివేసినప్పుడు సాంబాలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అఖ్నూర్‌లోధ్య పాకిస్తాన్ డ్రోన్‌లను భారత వైమానిక రక్షణ వ్యవస్థ కూల్చివేసింది.

ఫిరోజ్‌పూర్‌లో పడిపోయిన డ్రోన్ అక్కడ మంటలకు కారణమైంది. జనాలు మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. నివాస ప్రాంతంలో డ్రోన్ కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కుటుంబసభ్యులు గాయపడ్డారు. ఫిరోజ్‌పూర్ ఎస్‌ఎస్‌పి భూపిందర్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ, “ముగ్గురు వ్యక్తులు గాయపడినట్లు సమాచారం అందింది. వారి శరీరాలపై కాలిన గాయాలు ఉన్నాయి. వైద్యులు వారికి చికిత్స చేస్తున్నారు. అయితే సైన్యం చాలా డ్రోన్‌లను ఇప్పటికే నిర్విర్యం చేసింది” అని అన్నారు.

గురువారం(మే 08) లాగే, శుక్రవారం కూడా పాకిస్తాన్ పౌర విమానయాన సంస్థల ముసుగులో భారతదేశంలోని అనేక ప్రాంతాలలో డ్రోన్ దాడులను కొనసాగిస్తోంది. పాకిస్తాన్‌కు PIA, బ్లూ ఎయిర్ ఎయిర్‌లైన్ విమానాలు పాకిస్తాన్ గగనతలంలో ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో, భారతదేశం వైమానిక ప్రతిస్పందన ఇస్తే, పొరపాటున పౌర విమానాలు లక్ష్యంగా మారవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత వాయు సేన అప్రమత్తమైంది.

శుక్రవారం(మే 09) రాత్రి జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్‌లోని అనేక నగరాల్లో పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని, నగరాల్లో బ్లాక్‌అవుట్ విధించారు. యుద్ధ సైరన్‌లు మోగించారు. ప్రజలు బయటకు వెళ్లవద్దని, సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..