విమాన చార్జీలపై ఆంక్షలు ఆగస్ట్‌ 24 వరకు కొనసాగింపు..?

| Edited By:

Jun 21, 2020 | 7:46 PM

లాక్‌డౌన్ నేపథ్యంలో అకస్మాత్తుగా నిలిచిన ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ సర్వీసులను మరికొద్ది రోజుల్లో దశల వారీగా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే జూలై నెల మధ్య నుంచి...

విమాన చార్జీలపై ఆంక్షలు ఆగస్ట్‌ 24 వరకు కొనసాగింపు..?
Follow us on

లాక్‌డౌన్ నేపథ్యంలో అకస్మాత్తుగా నిలిచిన ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ సర్వీసులను మరికొద్ది రోజుల్లో దశల వారీగా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే జూలై నెల మధ్య నుంచి లిమిటెడ్‌ సర్వీసులను ప్రారంభించనున్నట్లుగా సమాచారం. గత నెలలో దేశీయ విమాన సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే గతంలో రోజుకు మూడు లక్షల మంది దేశీయంగా ప్రయాణికులు ప్రయాణించేవారు. అయితే ప్రస్తుతం వీరి సంఖ్య ప్రస్తుతం గణనీయంగా తగ్గింది. 700 విమానాల్లో కేవలం 65 నుంచి 70 వేల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వచ్చే వారం నుంచి దేశీయ విమాన సర్వీసుల్లో మరిన్ని రూట్లను పెంచడంతో పాటు.. ఫ్రీక్వెన్సీలను కూడా పెంచనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి తెలిపారు. వచ్చే జూలై మాసానికి ప్రయాణికుల రద్దీ పెరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. అయితే అంతర్జాతీయ సర్వీసులు నడపడానికి కూడా పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే తొలుత ఇతర దేశాలు తమ గగన తలాన్ని ఓపెన్‌ చేసిన తర్వాత.. అంతర్జాతీయ సర్వీసులు నడిపే దాని గురించి ఆలోచిస్తామన్నారు. ఇక టికెట్ల ధరల విషయంలో పరిస్థితులను బట్టి ఆగస్ట్‌ 24 తర్వాత కూడా పొడిగించే అవకాశం ఉందని.. విమానయాన శాఖ కార్యదర్శి పిఎస్ ఖరోలా తెలిపారు.