Operation Sindoor: ఆపరేషన్‌ సింధూర్‌.. కీలక ఉగ్రనేతల హతం.. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు

పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారం మొదలైంది.. పాకిస్తాన్‌, పీవోకేలో మిస్సైళ్లతో విరుచుకుపడింది భారత ఆర్మీ.. ఒకేసారి తొమ్మిది టార్గెట్స్‌పై బాంబుల వర్షం కురిపించింది.. పాకిస్తాన్‌లో 4.. పీవోకేలో 5 చోట్ల ఎటాక్స్‌ చేసింది.. ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో అర్థరాత్రి ఒంటిగంట తర్వాత మెరుపు దాడులు చేసింది..

Operation Sindoor: ఆపరేషన్‌ సింధూర్‌.. కీలక ఉగ్రనేతల హతం.. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు
Operation Sindoor

Updated on: May 07, 2025 | 10:59 AM

పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారం మొదలైంది.. పాకిస్తాన్‌, పీవోకేలో మిస్సైళ్లతో విరుచుకుపడింది భారత ఆర్మీ.. ఒకేసారి తొమ్మిది టార్గెట్స్‌పై బాంబుల వర్షం కురిపించింది.. పాకిస్తాన్‌లో 4.. పీవోకేలో 5 చోట్ల ఎటాక్స్‌ చేసింది.. ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో అర్థరాత్రి ఒంటిగంట తర్వాత మెరుపు దాడులు చేసింది.. పాకిస్తాన్‌తోపాటు పీవోకేలో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేసింది. 8 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల రేంజ్‌లో మిస్సైళ్ల వర్షం కురిపించింది.. భారత్‌ దాడుల్లో 70 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.. ఉగ్ర స్థావరాల్లో దాదాపు 100 మంది వరకు మరణించినట్లు సమాచారం.. అయితే, ఆపరేషన్‌ సింధూర్‌లో కీలక ఉగ్రనేతల హతమయ్యారు. మురిడ్కేలోని మర్కజ్‌ తయ్యబాపై దాడుల్లో.. లష్కరే తోయిబా నేత హఫీజ్‌ అబ్దుల్ మాలిక్‌ హతమయ్యాడు.. అతనితోపాటు మరో ఉగ్ర నేత ముదాసిర్‌ ను కూడా మట్టుబెట్టారు. వారితోపాటు మరికొందరు కూడా మరణించినట్లు తెలుస్తోంది..

భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత.. 10 మంది పౌరులు మృతి..

ఆపరేషన్ సిందూర్ దాడుల అనంతరం భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.. భారత్ చెక్‌పోస్టులు లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. పాక్‌ సైన్యం కాల్పుల్లో 10 మంది పౌరులు మృతి చెందారు. భారత్‌ ఆర్మీని ఎదురుకోలేక సామన్య ప్రజలపై పాక్‌ సైన్యం కాల్పులు జరుపుతోంది. కశ్మీర్‌ సహా ఎల్‌వోసీ వెంబడి పాక్ రేంజర్ల కాల్పులు కొనసాగుతున్నాయి.. యూరీ, కుప్వారా, రాజౌరి-పూంచ్ సెక్టార్లలో కాల్పులు జరిగాయి. పాక్‌ సైన్యం కాల్పులను భారత బలగాలు తిప్పికొడుతున్నాలీ.. భారత సైన్యం కాల్పుల్లో పలువురు పాక్ సైనికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. కాల్పుల్లో పలువురు సైనికులకు కూడా గాయాలయ్యాయని పేర్కొంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..