Indian Navy: భారత్, ఫ్రాన్స్ కీలక ఒప్పందం.. నావికాదళం కోసం రూ. 63 వేల కోట్ల డీల్..

భారత్, ఫ్రాన్స్ దేశాలు సోమవారం కీలక ఒప్పందంపై సంతకం చేశాయి. భారత నావికాదళం కోసం 26 రాఫెల్ మెరైన్ విమానాలను కొనుగోలు చేసేందుకు సోమవారం ఇరు దేశాలు రూ. 63 వేల కోట్ల మెగా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ కార్యక్రమానికి భారతదేశం తరపున రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్..

Indian Navy: భారత్, ఫ్రాన్స్ కీలక ఒప్పందం.. నావికాదళం కోసం రూ. 63 వేల కోట్ల డీల్..
Indian Navy

Updated on: Apr 28, 2025 | 2:50 PM

భారత్, ఫ్రాన్స్ దేశాలు సోమవారం కీలక ఒప్పందంపై సంతకం చేశాయి. భారత నావికాదళం కోసం 26 రాఫెల్ మెరైన్ విమానాలను కొనుగోలు చేసేందుకు సోమవారం ఇరు దేశాలు రూ. 63 వేల కోట్ల మెగా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ కార్యక్రమానికి భారతదేశం తరపున రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, నేవీ వైస్ చీఫ్ వైస్ అడ్మిరల్ కె. స్వామినాధన్ హాజరయ్యారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో కొద్దిరోజుల క్రితమే ఈ ఒప్పందాన్ని ప్రధాని మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల క్యాబినేట్ కమిటీ ఆమోదించడం గమనార్హం.

ఈ రాఫెల్ మెరైన్ జెట్స్ స్వదేశీ విమాన వాహక నౌక INS విక్రాంత్ నుంచి పని చేయనున్నాయి. 22 సింగిల్-సీట్ రాఫెల్-ఎం జెట్‌లు, నాలుగు ట్విన్-సీట్ ట్రైనర్‌లు, కొన్ని ఆయుధాలు, సిమ్యులేటర్లు, ఐదు సంవత్సరాల పనితీరు-ఆధారిత లాజిస్టిక్స్ సపోర్ట్ లాంటి అంశాలు ఇరు దేశాల కుదుర్చుకున్న ఒప్పందంలో పొందుపరిచి ఉన్నాయి. ఈ 26 రాఫెల్-ఎం యుద్ధ విమానాలు, ఒప్పందం కుదుర్చుకున్న 37 నుంచి 65 నెలల్లో డెలివరీ అవుతాయి. అంటే దాదాపుగా 2031వ సంవత్సరం నాటికీ డెలివరీ కానున్నాయి. ఇక ఒప్పందం ప్రకారం.. మొత్తం ఖర్చులో భారతదేశం మొదట 15 శాతం ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లించనుంది.