COVID19 Vaccination: దేశంలో వేగవంతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ.. 3.17 కోట్లు దాటిన లబ్ధిదారుల సంఖ్య

|

Mar 16, 2021 | 7:47 AM

India Corona Vaccination Updates: భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాది మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. దేశంలో జనవరి 16 ప్రారంభమైన కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్

COVID19 Vaccination: దేశంలో వేగవంతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ.. 3.17 కోట్లు దాటిన లబ్ధిదారుల సంఖ్య
Follow us on

India Corona Vaccination Updates: భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాది మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. దేశంలో జనవరి 16 ప్రారంభమైన కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ మరో ముందడుగు వేసింది. ఇప్పటివరకు 3 కోట్లపైగా కరోనా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. వీరిలో దాదాపు 2 కోట్ల 45 లక్షల మందికి తొలి డోసు అందించగా, మరో 60 లక్షల మందికి రెండో డోసు పంపిణీ చేశారు. సోమవారం సాయంత్రం 7గంటల నాటికి దేశంలో 3.17 కోట్ల (3,17,71,661) డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో అత్యధికంగా రాజస్థాన్‌, మహారాష్ట్రాల్లో ఇప్పటివరకు 28 లక్షల చొప్పున కోవిడ్ వ్యాక్సిన్‌ను అందించారు. గుజరాత్‌లో 25 లక్షల డోసులు, ఉత్తర్‌ప్రదేశ్‌లో 24 లక్షల చొప్పున టీకాలను అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భారతదేశం మరో మైలురాయిని దాటిందంటూ ఆరోగ్యశాఖ పేర్కొంది. భారత్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని వెల్లడించింది. అయితే ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 74,08,521 మంది ఆరోగ్య కార్యకర్తలు టీకా మొదటి డోసును తీసుకున్నారు. మరో 43,97,613 మంది రెండో డోసు తీసుకున్నారు. దీంతోపాటు ఫ్రంట్‌లైన్ కార్మికులు 74,26,479 మంది మొదటి డోసు తీసుకోగా.. మరో 13,23,527 మంది రెండో డోసూ కూడా తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడిన వారు 16,96,497 మంది లబ్ధిదారులకు టీకా పంపిణీ చేశారు. దీంతోపాటు 60 ఏళ్లు పైబడిన 95,19,024 మంది లబ్ధిదారులకు మొదటి డోసు అందించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

జనవరి 16 నుంచి దేశంలో ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియలో ముందుగా ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్‌లైన్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చారు. అనంతరం మార్చి 1నుంచి రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దీనిలో 60ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ అందిస్తున్నారు.

Also Read:

Covid Vaccine Side Effects : కరోనా టీకా వేసుకున్నారా..! అయితే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి తప్పించుకోవడానికి ఏం తినాలో తెలుసా..