వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన భారత్.. 100 కిలోమీటర్ల రహదారిని కేవలం 100 గంటల్లోనే నిర్మించేశారు

|

May 19, 2023 | 10:43 PM

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్-అలీగఢ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం సరికొత్త రికార్డు సృష్టించింది. దాదాపు 100 కిలోమీటర్ల పొడవైన రహదారిని కేవలం 100 గంటల్లోనే నిర్మించేశారు. ఈ విషయాన్ని జాతీయ రహదారులు, రోడ్డు రవాణాశాఖ అధికారికంగా ప్రకటించింది.

వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన భారత్.. 100 కిలోమీటర్ల రహదారిని కేవలం 100 గంటల్లోనే నిర్మించేశారు
Highway
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్-అలీగఢ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం సరికొత్త రికార్డు సృష్టించింది. దాదాపు 100 కిలోమీటర్ల పొడవైన రహదారిని కేవలం 100 గంటల్లోనే నిర్మించేశారు. ఈ విషయాన్ని జాతీయ రహదారులు, రోడ్డు రవాణాశాఖ అధికారికంగా ప్రకటించింది. అయితే రహదారి నిర్మాణంలో భాగస్వాములైన వారిని అభినందించేందుకు ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఎన్‌హెచ్-34లో ఘజియాబాద్-అలీగఢ్ మధ్య 118 కిలోమీటర్ల పొడవైన మార్గం ఎంతో కీలకమని.. జనసాంద్రత ఎక్కవగా ఉన్న ప్రాంతాలను అనుసంధానం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

అలాగే ఉత్తర్‌ప్రదేశ్‌లోని దాద్రి, కుర్జా, సికందర్‌బాద్‌, , గౌతమ్‌ బుద్ధ్‌ నగర్‌ తదితర పట్టణాలను కలుపేలా ఈ రహదారి వెళ్తుండటం అందరికీ కలిసొచ్చే అంశమని గడ్కరీ అన్నారు. వర్తక నిర్వహణకు ఈ రహదారి కీలకంగా పని చేస్తుందని.. వ్యవసాయ, పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ.. ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ రహదారి నిర్మాణంలో వినూత్నంగా గ్రీన్‌ టెక్నాలజీని కూడా వినియోగించినట్లు తెలిపారు. దాదాపు 90 శాతం మిల్లింగ్‌ మెటీరియల్‌ను ఉపయోగించడం వల్ల రహదారి నిర్మాణ సమయంలో పర్యావరణానికి హాని కలిగించే ఉద్గారాలను చాలా వరకు తగ్గించినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..