India Coronavirus: భారత్‌లో కొత్తగా 4 లక్షలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు..రికార్డు స్థాయిలో మరణాలు..!

|

May 07, 2021 | 10:46 AM

India Corona Updates: భారత్‌లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో భారత్‌లో..

India Coronavirus: భారత్‌లో కొత్తగా 4 లక్షలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు..రికార్డు స్థాయిలో మరణాలు..!
India Corona Cases
Follow us on

India Corona Updates: భారత్‌లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో భారత్‌లో 4,14,188 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 3,915 మంది మరణించారు. ఇక ఇప్పటి వరకు భారత్‌లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,14,91,598 కాగా, మరణాల సంఖ్య 2,34,083కు చేరింది. అయితే గత పది రోజుల నుంచి వరుసగా రోజు 3 లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం, ఇక రెండు, మూడు రోజుల నుంచి 4 లక్షలు దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. కేసులతో పోలిస్తే రివకరీ కేసులు కూడా చాలా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 3,31,507 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,76,12,351కి చేరింది. ప్రస్తుతం దేశంలో 35,45,164 క్రియాశీల కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో నిన్న ఒక్క రోజు 18,26,490 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 16,49,73,058 కరోనా టీకాలు పంపిణీ చేశారు.

అయితే కరోనా వైరస్‌ వేరియంట్లలో వ్యాప్తి చెందుతుంటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. మొదటి వేవ్‌ కంటే సెకండ్‌వేవ్‌ చాలా తీవ్రమైనదిగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరు బయటకు వెళ్లాలంటే మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. ముందు ముందు మరిన్ని వేవ్‌లు వచ్చే అవకాశం ఉందని, వాటిని ఎదుర్కొనేందుకు ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. కరోనాను అంతం చేయాలంటే ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించినప్పుడే అది సాధ్యమవుతుందని చెబుతున్నారు. వీలైనంత వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఉండడమే మేలని అంటున్నారు.

ఇవీ కూడా చదవండి:

Remdesivir Injection: కేంద్రం కీలక నిర్ణయం.. అతి తక్కువ ధరకే రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌.. ఎలా పొందాలంటే..!

ఒత్తిడికి లోనైనప్పుడు కనిపించే లక్షణాలు.. ఒత్తిడిని జయించడం ఎలా..?: ఏపీ కోవిడ్ కమాండ్ కంట్రోల్ కీలక సూచనలు