భారత్ కరోనా అప్‌డేట్స్ : గ‌డిచిన 24 గంట‌ల్లో 24,337 క‌రోనా పాజిటివ్ కేసులు.. మ‌ర‌ణాలు ఎన్నంటే..

|

Dec 21, 2020 | 11:21 AM

భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 9,00,134 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 24,337 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో...

భారత్ కరోనా అప్‌డేట్స్ : గ‌డిచిన 24 గంట‌ల్లో 24,337 క‌రోనా పాజిటివ్ కేసులు.. మ‌ర‌ణాలు ఎన్నంటే..
Follow us on

భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 9,00,134 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 24,337 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,00,55,560కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 333 మంది మృతి చెందగా, ఇప్పటి వరకు మరణాల సంఖ్య 1,45,810కి చేరింది. తాజాగా 25,709 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం రికవరీ సంఖ్య 96,06,111కు చేరింది. అలాగే దేశంలో మరణాల రేటు 1.45 శాతం ఉండగా, రికవరీ రేటు 95.53 శాతం ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలపింది. అయితే సోమవారం ఉదయం నాటికి 3,03,639 యాక్టివ్ కేసులున్నాయి.

కాగా, గతంలో దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు అధికంగా ఉన్నా..ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. వైరస్ ను అరికట్టేందు వ్యాక్సిన్ ప్రయోగ దశలో ఉంది. ప్రస్తుతం దేశంలో ఆరు కోవిడ్ వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉండగా, వచ్చే ఏడాది జనవరిలో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.

జ‌న‌వ‌రిలో క‌రోనా వ్యాక్సినేష‌న్ .. ప్ర‌యోగ ద‌శ‌లో ఆరు వ్యాక్సిన్లు: ‌కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి

COVID-19 Death Rate: భారత్‌లో తగ్గుతున్న కరోనా మరణాలు… దేశంలో మరణాల శాతం ఎంతంటే..?