COVID-19 Death Rate: భారత్‌లో తగ్గుతున్న కరోనా మరణాలు… దేశంలో మరణాల శాతం ఎంతంటే..?

భారత దేశంలో కరోనా ఉధృతి తగ్గుతోందని కేంద్ర ప్రభుత్వం తెలుపుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడంతో పాటు మరణాల సంఖ్య తగ్గుతూ వస్తోందని ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

COVID-19 Death Rate: భారత్‌లో తగ్గుతున్న కరోనా మరణాలు... దేశంలో మరణాల శాతం ఎంతంటే..?
Follow us

| Edited By:

Updated on: Dec 21, 2020 | 10:35 AM

భారత దేశంలో కరోనా ఉధృతి తగ్గుతోందని కేంద్ర ప్రభుత్వం తెలుపుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడంతో పాటు మరణాల సంఖ్య తగ్గుతూ వస్తోందని ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ ప్రభావం ఉన్నా భారత్‌లో దాని తీవ్రత లేదని ప్రభుత్వం చెబుతోంది. దేశంలో కోటి పాజిటివ్ కేసులు దాటిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా కొన్ని గణాంకాలను విడుదల చేసింది. వాటి ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ రికవరీ రేటు, తక్కువ మరణాల రేటు కలిగిన దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉన్నట్లు తెలుపుతోంది.

గణాంకాలివే….

దేశ వ్యాప్తంగా డిసెంబర్ 14 -20 మధ్య రోజుల్లో సగటున కేవలం 351 కొవిడ్ మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో చనిపోతున్నవారి సంఖ్యతో పోలిస్తే భారత్ లో కనిష్ట మరణాలు నమోదవుతున్నాయని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, నిబంధనల కారణంగా గత నెల రోజుల్లో సగటున రోజుకు 400 లోపు మరణాలు మాత్రమే సంభవించాయని వివరించింది. కాగా, గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,45,477 నూతన కేసులు నమోదు కాగా, కేవలం 341 మంది మాత్రమే చనిపోయారని తెలిపింది.

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు కోటి దాటాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే, దేశంలో రికవరీ రేటు 95.51 శాతంగా ఉందని, మరణాల సంఖ్య కేవలం 3 శాతమేనని స్పష్టం చేసింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా లక్ష మంది కరోనా బారినపడగా…. 26,624 మంది రికవరీ అయ్యారని, 341 మంది మాత్రమే చనిపోయారని వివరించింది. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కేసులు, మరణాల తో పోలిస్తే భారత్‌లో కేసులు, మరణాలు తక్కువగా నమోదవుతున్నట్లు కేంద్రం తెలిపింది.