ఇండియాలో క‌రోనా విల‌యం..24 గంట‌ల్లో 681 మంది మృతి

దేశంలో కరోనా తన వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో 40,425 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మరో 681 మంది కరోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు.

ఇండియాలో క‌రోనా విల‌యం..24 గంట‌ల్లో 681 మంది మృతి

Updated on: Jul 20, 2020 | 10:16 AM

దేశంలో కరోనా తన వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో 40,425 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మరో 681 మంది కరోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. జులై 19 వరకు దేశవ్యాప్తంగా 1,40,47,908 శాంపిల్స్ ట‌స్ట్ చేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్య శాఖ‌ వెల్లడించింది. ఆదివారం ఒక్కరోజే 2,56,039 టెస్టులు చేశారు.

ప్ర‌భుత్వ లెక్క‌ల ప్ర‌కారం దేశవ్యాప్తంగా కోవిడ్-19 వివ‌రాలు

దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు 11,18,043
దేశంలో ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు 3,90,459
వ్యాధి బారి నుంచి కోలుకున్నావారు 7,00,087
దేశ‌వ్యాప్తంగా క‌రోనాతో మ‌ర‌ణించిన‌వారు 27,497

ఇక రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే.. మహారాష్ట్రలో క‌రోనా మ‌రింత ప్రమాద‌క‌రంగా మారుతోంది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,10,455కు చేరింది. 11,585 మంది వైర‌స్ కార‌ణంగా చ‌నిపోయారు. తమిళనాడులో కోవిడ్-19 కేసులు 1,70,693కి చేరాయి. 2,481 మంది వ్యాధికి బ‌లయ్యారు. ఢిల్లీలో క‌రోనా​ బాధితుల సంఖ్య 1,22,793గా ఉంది. మొత్తంగా 3,628 మంది ప్రాణాలు విడిచారు. గుజరాత్​లో మొత్తంగా 48,441 మందికి కరోనా సోకింది. 2,156 మంది కరోనా కారణంగా మృతి చెందారు.