India Corona Cases: గత 24 గంటల్లో 29,689 పాజిటివ్ కేసులు, మరణాలు.. కొత్తగా ఎన్నంటే!

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు,మరణాల్లో రోజూ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 17,20,100 మందికి కరోనా నిర్ధారణ...

India Corona Cases: గత 24 గంటల్లో 29,689 పాజిటివ్ కేసులు, మరణాలు.. కొత్తగా ఎన్నంటే!
India Corona

Updated on: Jul 27, 2021 | 10:53 AM

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు,మరణాల్లో రోజూ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 17,20,100 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 29,689 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 3,98,100కి చేరింది. ఇందులో 3,06,21,469 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న కొత్తగా 42,363 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ కావడంతో.. రికవరీల సంఖ్య 3,06,21,469కి చేరింది.

అటు నిన్న 415 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 4,21,382 చేరుకుంది. ఇదిలా ఉంటే ఇప్పటిదాకా 44,19,12,395 కోట్ల వ్యాక్సినేషన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కాగా, దేశంలో క్రియాశీల రేటు 1.31 శాతానికి చేరిందని.. అలాగే రికవరీ రేటు 97.35 శాతంలో ఉందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి:  Petrol Diesel Price: పట్టణవాసులకు గుడ్ న్యూస్.. స్థిరంగా పెట్రో ధరలు..ఏపీలో మాత్రం..

Rivers overflowing: తెలుగు రాష్ట్రాల్లో నదీ జలాల ఉరుకులు.. పరుగులు.. నిండుకుండలా ప్రాజెక్టులు

Nirai Mata Temple: ఈ అమ్మవారి ఆలయం ఏడాదిలో 5 గంటలే తెరిచి ఉంటుంది.. ఎక్కడో తెలుసా..

PNB: బ్యాంక్ లోన్ తిరిగి చెల్లించలేకపోయారా.. అయితే మీకు గుడ్ న్యూస్.. 25 నుంచి 75 శాతం రిబేటు