India Corona Cases: దేశ ప్రజలకు శుభవార్త.. భారీగా తగ్గిన పాజిటివ్ కేసుల సంఖ్య.. 72 రోజుల కనిష్టానికి..

దేశ ప్రజలకు శుభవార్త. రోజూవారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 70,421 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి...

India Corona Cases: దేశ ప్రజలకు శుభవార్త.. భారీగా తగ్గిన పాజిటివ్ కేసుల సంఖ్య.. 72 రోజుల కనిష్టానికి..
India Corona Updates

Updated on: Jun 14, 2021 | 10:23 AM

దేశ ప్రజలకు శుభవార్త. రోజూవారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 70,421 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్‌ 2 తర్వాత గత 72 రోజుల్లో ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. . దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2,95,10,410కి చేరింది. ఇందులో 9,73,158 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గురువారం కొత్తగా 1,19,501 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ కావడంతో.. రికవరీల సంఖ్య 2,81,62,947కి చేరింది.

అటు నిన్న 3921 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 3,74,305కి చేరుకుంది. ఇదే క్రమంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగం పుంచుకుంది. దేశంలో ఇప్పటివరకు 25,48,49,301 మందికి వ్యాక్సిన్‌ అందించారు. అటు దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 95.43 శాతంగా ఉందని.. డెత్ రేట్ 1.27 శాతంగా ఉందని తెలిపింది.

Also Read: ఏడాది గడుస్తున్నా తేలని సుశాంత్ డెత్ మిస్టరీ.. అతడు ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ పదిలం