భారత్-చైనా ఆయుధాల తరలింపు.. లడఖ్ ఉద్రిక్తం

లడఖ్ లోని వివాదాస్పద భూభాగాలలో భారత. చైనా దళాలు తమ తమ ఆయుధాలను, భారీ యుధ్ధ శకటాలను మోహరిస్తున్నాయి. తమ స్థావరాల వద్దకు  పోరాట వాహనాలను తరలిస్తున్నాయి. గత ఇరవై, ఇరవై అయిదు రోజులుగా ఈ ప్రాంతాల్లో ఉభయ దళాలూ ముఖాముఖి తలపడేంత  పరిస్థితి నెలకొన్నదని సైనిక వర్గాలు తెలిపాయి. ఓ వైపు మిలిటరీ, దౌత్య స్థాయుల్లో వివాద పరిష్కారానికి రెండు దేశాలూ ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు లడఖ్ లో ఇందుకు విరుద్ధమైన పరిస్థితి ఏర్పడిందని ఈ […]

భారత్-చైనా ఆయుధాల తరలింపు.. లడఖ్ ఉద్రిక్తం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 01, 2020 | 1:56 PM

లడఖ్ లోని వివాదాస్పద భూభాగాలలో భారత. చైనా దళాలు తమ తమ ఆయుధాలను, భారీ యుధ్ధ శకటాలను మోహరిస్తున్నాయి. తమ స్థావరాల వద్దకు  పోరాట వాహనాలను తరలిస్తున్నాయి. గత ఇరవై, ఇరవై అయిదు రోజులుగా ఈ ప్రాంతాల్లో ఉభయ దళాలూ ముఖాముఖి తలపడేంత  పరిస్థితి నెలకొన్నదని సైనిక వర్గాలు తెలిపాయి. ఓ వైపు మిలిటరీ, దౌత్య స్థాయుల్లో వివాద పరిష్కారానికి రెండు దేశాలూ ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు లడఖ్ లో ఇందుకు విరుద్ధమైన పరిస్థితి ఏర్పడిందని ఈ వర్గాలు పేర్కొన్నాయి. అక్కడి వాస్తవాధీన రేఖ వద్ద గల తమ స్థావరాల సమీపానికి చైనా ఆర్మీ క్రమంగా ఆర్టిల్లరీ, ఇన్ ఫెంట్రీ పోరాట వాహనాలను, హెవీ మిలిటరీ ఈక్విప్ మెంట్ ని తరలిస్తున్నట్టు తెలిసింది. దీంతో భారత సైన్యం కూడా అదే స్థాయిలో ఆయుధాలతో బాటు అదనపు బలగాలను మోహరిస్తోన్నట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. పాంగంగ్ సో లోను, గాల్వాన్ వ్యాలీ లోను, మరికొన్ని భూభాగాల్లో సైతం యధాతథ పరిస్థితి ఏర్పడేంతవరకు ఇండియా వెనుకంజ వేయదని మిలిటరీ వర్గాలు స్పష్టం చేశాయి. డెంచోక్, దౌలత్ బేగ్, వోల్డీ వంటి సున్నిత భూభాగాల్లో చైనా తన ఆయుధ సంపత్తిని మోహరించడం ఆందోళన కలిగిస్తోంది. డీ ఫాక్ట్ బోర్డర్ లో డ్రాగన్ కంట్రీ జరుపుతున్న నిర్మాణాలు శాటిలైట్ కళ్ళకు చిక్కాయి.

Latest Articles