Independence Day 2022 Celebrations Highlights: స్వాంతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు జరుపుకోవడానికి యావత్ దేశం సిద్ధమైంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు వీధులన్నీ జెండాలతో నిండిపోయాయి. ప్రతీ ఇంటిపై జాతీయ పతాకం రెపరెపలాడుతోంది. చిన్నా, పెద్దా అందరూ స్వాతంత్ర్య వేడుకలు సంతోషంగా జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా పలు కార్యక్రమాలు చేపడుతోంది. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టిన సందర్భాన, దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న రోజును దేశ ప్రజలంతా కుల, మతాతలకు అతీతంగా జరుపుకుంటున్నారు.
గడిచిన రెండు రోజులుగా ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 15 జెండా పండుగ సందర్భంగా దేశ వ్యాప్తంగా జరుగుతోన్న సంబురాలకు సంబంధించిన వార్తా కథనాల లైవ్ అప్‌డేట్స్‌ని టీవీ9 ప్రత్యేకంగా మీకోసం అందిస్తోంది..
గోల్కోండ కోటలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. జెండా ఆవిష్కరణ అనంతరం సీఎం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ వ్యాప్తంగా 15 రోజుల పాటు స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు జరుపుకున్నాము. తెలంగాణ రాష్ట్రం త్రివర్ణ శోభితంగా విరాజిల్లుతోంది. దేశానికి దూక్సూచిగా తెలంగాణ నిలుస్తోంది. దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది’ అని చెప్పుకొచ్చారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న, చేసిన అభివృద్ధి పనులు గురించి కేసీఆర్ ఏమన్నారంటే..
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏపీ సీం జగన్ మోహన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘జాతీయ జెండా భిన్నత్వంలో ఏకత్వానికి, ప్రజాస్వామ్యానికి ప్రతీక. పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా భారతీయుల గుండె’ అని చెప్పుకొచ్చారు.
దేశం నవసంకల్పంతో ముందుకెళ్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఎర్రకోట పై ఆయన వరుసగా 9వ సారి జాతీయ జెండాను ఎగరవేశారు. ఈసందర్భంగా జాతినుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ.. తొలుత దేశ ప్రజలకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర ఉద్యమంలో మహిళా శక్తి ఎంతో కీలకంగా వ్యవహరించిందని.. ఎంతో మంది మహిళా మణులు ప్రాణత్యాగం చేశారని.. వారిని చూసి దేశం గర్విస్తోందన్నారు. ఎంతో మంది మహానీయుల పేర్లను స్మరిస్తూ.. వారందరిని ఈసందర్భంగా గుర్తుచేసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆదివాసీలు స్వాతంత్య్ర ఉద్యమంలో పోషించిన పాత్రను గుర్తు చేస్తూ.. అల్లూరి సీతారామరాజు పేరును ప్రధాని స్మరించుకున్నారు. మహత్మాగాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, వీర సావర్కర్ వంటి మహానీయుల స్ఫూర్తితో దేశం ముందుకెళ్తోందన్నారు.
75 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రధాని నరేంద్రమోదీ జాతీని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రపంచ వ్యాప్తంగా జాతీయ జెండా రెపరెపలాడుతోంది. అజాదీకా అమృత్ మహోత్సవ్ భారత్‌కు మాత్రమే పరిమితం కాలేదు. దేశం నవ సంకల్పంతో వెళుతోంది. అమర వీరుల త్యాగాన్ని స్మరించుకోవాలి. దేశం కోసం పోరాడిన వీరనారీమణులకు సెల్యూట్ చేస్తున్నాను. అల్లూరి సీతరామరాజు మాతృభూమి కోసమే జీవించారు’ అని చెప్పుకొచ్చారు.
#WATCH Live: Prime Minister Narendra Modi addresses the nation from the ramparts of the Red Fort on #IndependenceDay (Source: DD National)
— ANI (@ANI) August 15, 2022
మరికాసేపట్లో ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించనున్న ప్రధాని నరేంద్ర మోదీ రాజ్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. మహాత్మాగాంధీ సమాధికి నమస్కరించి, పుష్పాంజలి ఘటించారు. ప్రస్తుతం మోదీ ఎర్రకోటకు బయలుదేరారు.
Delhi | PM Modi pays tribute to Mahatma Gandhi at Rajghat on the 76th Independence Day pic.twitter.com/1UFpkoVoAR
— ANI (@ANI) August 15, 2022
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఎగురవేశారు. న్యూఢిల్లీలోని తన నివాసంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించినట్లు మంత్రి స్వయంగా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.
Unfurled the National Flag at my official residence in New Delhi, on the special occasion of India’s 76th #स्वतंत्रतादिवस. pic.twitter.com/cd34xX4Rga
— G Kishan Reddy (@kishanreddybjp) August 15, 2022
మరికాసేపట్లో ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం ఎర్రకోటను సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం ఇది వరుసగా తొమ్మిదో సారి. ప్రధాని షెడ్యూల్ సాగుతుంది ఇలా..
* ఉదయం 7:06 – మహాత్మా గాంధీ సమాధి అయిన రాజ్‌ఘాట్‌లో ప్రధాని మోదీ పూలమాలలు వేస్తారు.
* ఉదయం 7:14 గంటలకు రాజ్‌ఘాట్ నుంచి ఎర్రకోటకు బయలుదేరుతారు.
7:18 గంటలకు లాహోరీ గేట్‌కు వెళ్లి ఆర్‌ఎం, ఆర్‌ఆర్‌ఎం, డిఫెన్స్ వందనాలు తీసుకుంటారు.
* 7:20 గంటలకు ఎర్రకోట వద్ద గౌరవ గార్డ్ నిర్వహిస్తారు.
* 7:30 గంటలకు ప్రధాన మంత్రి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు.