75th Independence Day Parade Live Updates: భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి నేటికి 75 సంవత్సరాలు అవుతోంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. మొదటగా ఆయన రాజ్‌ఘాట్‌కు చేరుకుని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరుకుని త్రివిధ దళాల గౌరవవందనాన్ని స్వీకరించారు. అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. తొలుత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, ఈ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్ ఎర్రకోటకు చేరుకుని ప్రధానిని ఆహ్వానించారు. జెండా ఆవిష్కరణ సమయంలో భారత వైమానిక దళానికి చెందిన రెడు ఎంఐ-17 1వి హెలికాప్టర్లు తొలిసారిగా వేదికపై పూల వర్షం కురిపించాయి. ఈ రెండు హెలికాప్టర్లకు వింగ్ కమాండర్ బల్‌దేవ్ సింగ్ బిష్ట్, వింగ్ కమాండర్ నిఖిల్ మెహ్రోత్రా సారథ్యం వహించారు.
ఆంధ్రప్రదేశ్‌లో..
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఇంధిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్‌లో పంద్రాగస్టు వేడుకలు జరిగాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రాంగణానికి చేరుకుని.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సీఎం జగన్ ప్రసంగించారు.
తెలంగాణలో..
తెలంగాణలోని హైదరాబాద్ గోల్కోండ కోట ప్రాంగణంలో 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రాంగణానికి చేరుకుని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
ఇదిలాఉంటే.. భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకుల దృష్ట్యా ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో దేశ వ్యాప్తంగా భద్రతా దళాల హై అలర్ట్ మధ్య జెండా పండుగ జరిగింది. సంఘ వ్యతిరేక శక్తులు, అనుమానాస్పద వ్యక్తులు, ఖలిస్తానీ ఉద్యమంతో సంబంధం ఉన్నవారు, పోలీసు యూనిఫాంలో ఆటంకాలు సృష్టించవచ్చు అని ఐబీ హెచ్చరికల నేపథ్యంలో.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి, త్రివిధ దళాల అధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పాల్గొన్నారు.
Delhi | President Ram Nath Kovind paid tribute at the National War Memorial on Independence Day
Defence Minister, the three Service chiefs, Chief of Defence Staff were also present pic.twitter.com/1TuaAL4l8D
— ANI (@ANI) August 15, 2021
75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పంజాబ్ అట్టారి -వాఘా సరిహద్దులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్.. పాకిస్తానీ రేంజర్లు స్వీట్లు పంపిణీ చేసుకున్నారు.
Punjab: Border Security Force (BSF) and Pakistani Rangers exchange sweets at Attari-Wagah border on #IndependenceDay pic.twitter.com/Fjv4bCiuKC
— ANI (@ANI) August 15, 2021
75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
Delhi | Lok Sabha Speaker Om Birla hoists the National Flag on #IndependenceDay, says “We attained Independence after a long struggle, now we are working towards becoming a ‘New India’ as we celebrate ‘Azadi ka Amrit Mahotsav’ this year.” pic.twitter.com/A3DFiQWoKy
— ANI (@ANI) August 15, 2021
స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా తిరువనంతపురంలో కేరళ సీఎం పినరయి విజయన్ జాతీయ జెండాను ఎగురవేశారు.
Kerala CM Pinarayi Vijayan hoists the Tricolour to mark 75th Independence Day at Thiruvanathapuram pic.twitter.com/QgfLegNIvs
— ANI (@ANI) August 15, 2021
స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఏఐసీసీ భవన్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు.
Congress president Sonia Gandhi hoists the national flag at party headquarters in Delhi; Rahul Gandhi also present. pic.twitter.com/ClldZCpseC
— ANI (@ANI) August 15, 2021
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కోల్‌కతాలోని రెడ్‌రోడ్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి.
West Bengal CM Mamata Banerjee hoists the National Flag at Red Road in Kolkata on 75th Independence Day pic.twitter.com/IhOpHgwJ9m
— ANI (@ANI) August 15, 2021
ఏపీ మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా లఢఖ్ లెఫ్టినెంట్ గవర్నర్.. జాతీయ జెండాను ఎగురవేశారు. లేహ్‌లోనే పోలో గ్రౌండ్‌లో ఈ వేడుకలు జరిగాయి.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సచివాలయ భవనంలో జాతీయ జెండాను ఎగురవేశారు.
Delhi Chief Minister Arvind Kejriwal hoists the National Flag at Secretariat Building on #IndependenceDay, announces ‘Deshbhakti Curriculum’ in Delhi Govt Schools from September 27 as a tribute to Shaheed Bhagat Singh. pic.twitter.com/ZcWd9mXLfI
— ANI (@ANI) August 15, 2021
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
దేశం ఎన్నో రంగాల్లో అభివృద్ది సాధించిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ రోజున స్వాతంత్ర్య పోరాట ఉజ్వల ఘట్టాలను స్మరించుకోవాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
నల్లగొండలోని యాదాద్రి పవర్ ప్లాంట్ త్వరలోనే పూర్తవుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే తెలంగాణ మిగులు విద్యుత్ ఉంటుందని సీఎం పేర్కొన్నారు.
దేశ తలసరి ఆదాయం కంటే.. తెలంగాణ తలసరి ఆదాయం రెట్టింపు అయిందని సీఎం కేసఆర్ పేర్కొన్నారు. కరోనా ఆటంకంగా మారినా రాష్ట్రంలో అభివృద్ధి ఆగలేదని సీఎం కేసీఆర్ తెలిపారు.
దండగ అనుకున్న వ్యవసాయం.. పండుగలా మారిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత.. వ్యవసాయంలో రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి సాధించిందని కేసీఆర్ పేర్కొన్నారు.
ఏడేళ్లల్లో తెలంగాణ స్థిరమైన ఆర్థికాభివృద్దితో నెంబర్‌వన్ గా నిలిచిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణలో రేపటినుంచి అన్నదాతలకు రుణమాఫీ అమలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 3 లక్షలమందికి రుణమాఫీ అమలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రూ.25లోపు రుణాలను ఇప్పటికే మాఫీ చేసినట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
దేశం సాధించిన ప్రగతిని సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో ఇంకా అసమానతలు నెలకొన్నాయని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు.
విద్యుత్, తాగునీటి, సాగునీటి సమస్యలు తెలంగాణలో లేవని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఈ రంగాల్లో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.
స్వరాష్ట్రం సాధించుకున్న నాటినుంచి అన్ని రంగాల అభివృద్ధిపై దృష్టి సారించామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణలోని హైదరాబాద్ గోల్కొండ కోటలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా వందనం అనంతరం సాయుధ దళాల నుంచి గౌరవవందనం స్వీకరించారు.
75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. గోల్కొండ కోటకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
వైయస్సార్ చేయూత పథకం కింద ఇప్పటివరకు 9 వేల కోట్ల రూపాయలు మహిళలకు అందజేశామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని.. మొదటి దశలో 15 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. వైయస్సార్ సున్నా వడ్డీ పథకానికి 2,509 కోట్లు కేటాయించినట్లు వైఎస్ జగన్ పేర్కొన్నారు.
కార్పొరేట్ స్కూళ్లు తరహాలో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను మారుస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. గోరుముద్ద పథకం ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.
మహిళలు మరింత రాజకీయ సాధికారత సాధించాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. గ్రామ, సచివాలయాల కింద లక్షా 30వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. రైతులతోపాటు.. అన్ని వర్గాల అభివృద్ధికి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు.
అందరికీ సమాన హక్కులు లభించాలని సీఎం జగన్ పేర్కొన్నారు. రైతులకు ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలను అమలుచేశామని సీఎం జగన్ పేర్కొన్నారు. వ్యవసాయం రంగానికి 83 వేల కోట్లను అందించామని సీఎం జగన్ పేర్కొన్నారు.
26 నెలల కాలంలో ఎన్నో పథకాలను ప్రారంభించామని, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామని సీఎం జగన్ పేర్కొన్నారు.
కొత్త లక్ష్యాలను నిర్ధేశించుకునే సమయమిదని సీఎం జగన్ పేర్కొన్నారు. రేపు అనేది ప్రతీ ఒక్కరికి భరోసా ఇచ్చేలా ఉండాలని సీఎం వ్యాఖ్యానించారు. అందరి అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు.
పాదయాత్రలో జనం సమస్యలు తెలుసుకున్నానని ఏపీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
దేశంలో 15వేల అనవసరమైన చట్టాలను రద్దు చేసినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రతీ శాఖకు సంబంధించిన వివరాలను స్వయంగా తెలుసుకుంటున్నట్లు ప్రధాని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ మున్సిపల్ గ్రౌండ్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రాంగణానికి చేరుకుని.. గౌరవ వందనం స్వీకరించారు.
తరువాతి తరం కోసం.. మౌలిక సదుపాయాలు, ప్రపంచ స్థాయి ఉత్పత్తి, మెరుగైన ఆవిష్కరణలు, కొత్త టెక్నాలజీల కోసం మనమంతా కలిసి ముందుకెళ్లాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
భవిష్యత్తులో సన్నకారు రైతులకు మరింత శక్తిని చేకూర్చేలా ప్రణాళికలు చేస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. 70కి పైగా మార్గాల్లో ‘కిసాన్ రైలు’ నడుస్తున్నట్లు మోదీ తెలిపారు. ‘చోటా కిసాన్ బనే దేశ్ కి షాన్’ అనేది తమ మంత్రమని.. ఇదే దేశ లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రతీ మూలనున్న గ్రామాలు.. వేగంగా మారుతున్నాయని ప్రధాని మోదీ పేర్కొ్న్నారు. కొన్నేళ్లుగా గ్రామాలకు రోడ్లు, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు గ్రామాల్లో ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్, డేటా, ఇంటర్నెట్ చేరువయ్యాయన్నారు. త్వరలోనే గ్రామాలకు డిజిటల్ వ్యవస్థ చేరువ అవుతుందని పేర్కొన్నారు.
విద్య, ఆరోగ్యం, ఉపాధికి సంబంధించిన పథకాలలో ప్రభుత్వం వెనుకబడిన జిల్లాలకు ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశంలోని చాలా జిల్లాలు అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయని పేర్కొన్నారు. అలాంటి జిల్లాల్లో విద్య, ఆరోగ్యం, పోషకాహారం, రోడ్లు, ఉపాధికి సంబంధించిన పథకాల అమలుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.
100శాతం గ్రామాలకు రోడ్లు ఉండాలని.. అన్ని కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు ఉండాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
తూర్పు భారతదేశం, ఈశాన్య ప్రాంతం, జమ్మూ కాశ్మీర్, లడఖ్ హిమాలయ ప్రాంతం, తీర, గిరిజన ప్రాంతాలన్నీ భవిష్యత్తులో భారతదేశ అభివృద్ధికి కీలక ఆధారంగా మారుతాయని ప్రధాని మోదీ అన్నారు. ఈ ప్రాంతాలన్నీ అభివృద్ధికి అనుసంధానంగా మారుతాయని పేర్కొన్నారు.
జమ్మూకాశ్మీర్‌లో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేశామని.. భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్ ప్రబలశక్తిగా ఎదగాలనే సంకల్పం తీసుకోవాలని ప్రధాని కోరారు. 75 నుంచి శతాబ్ది ఉత్సవాల మధ్య ఉన్న 25 ఏళ్ల కాలం అమృత ఘడియలని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ అమృత కాలాన్ని సర్వ సమృద్ధ భారత్ నిర్మాణానికి మనం సంకల్పం తీసుకోవాలని పేర్కొన్నారు. ఇది నిరంతర శ్రమ, పట్టుదలతోనే సాకారమవుతుందని పేర్కొన్నారు. ఈ 25 ఏళ్లల్లో ప్రతీ అడుగు కీలకమేనని తెలిపారు.
ఏడేళ్లలో ఉజ్జ్వల నుంచి ఆయుష్మాన్ వరకు అనేక పథకాలు ప్రజల ముంగిట చేరాయని ప్రధాని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి పథకాలన్నీ హక్కుదారులందరికీ వందశాతం చేరేలా చేయాలని మోదీ పేర్కొన్నారు.
సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్.. ఇవే మన నినాదం కావాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అందరి భాగస్వామ్యంతోనే నవభారతం నిర్మాణం అవుతుందని పేర్కొన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్‌లో కొనసాగుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత్‌లో వ్యాధి సంక్రమణ, మరణాలు తక్కువని మోదీ పేర్కొన్నారు. మన జీవనశైలి, సామాజిక కట్టుబాట్లు మనల్ని కొంతవరకు రక్షించాయని ప్రధాని పేర్కొన్నారు.
దేశ విభజన గాయం నేటికీ వెంటాడుతూనే ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ధన, మాన, ప్రాణాలు పోగొట్టుకున్న వారి చేదు జ్ఞాపకాలు వెంటాడుతున్నాయని.. గౌరవప్రద అంత్యక్రియలకు నోచుకోని వారి చేదు జ్ఞాపకాలు కళ్లముందు కదులుతున్నాయంటూ ప్రదాని మోదీ పేర్కొన్నారు.
టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రధాని అభినందించారు. వారంతా మనకు స్ఫూర్తి అని.. దేశం యావత్తూ వారికి గౌరవం ప్రకటిస్తోందంటూ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశ సరిహద్దుల్లో నిరంతరం పహారా కాస్తున్న వీర జవాన్లను అభినందించారు. వారికి ప్రణామాలు అంటూ పేర్కొన్నారు.
కోవిడ్ సమయంలో, వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేస్తున్న శాస్త్రవేత్తలు, కోట్లాది మంది పౌరులు సేవా భావంతో పనిచేశారని ప్రధాని మోదీ కొనియాడారు. ఈ సమయంలో అనుక్షణం ఇతరులకు సేవ చేసినవారందరికీ.. మోదీ ప్రశంసించారు. వారి గురించి ఎంత చెప్పినా తక్కువేనంటూ అభిప్రాయపడ్డారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవాల్సిన రోజని పేర్కొన్నారు.
జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రధాని మోడీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు.
Delhi: Prime Minister Narendra Modi begins his address on #IndependenceDay2021, from the ramparts of the Red Fort. pic.twitter.com/B2rVf4G2FY
— ANI (@ANI) August 15, 2021
75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
Prime Minister Narendra Modi hoists the National Flag from the ramparts of Red Fort to celebrate the 75th Independence Day pic.twitter.com/0c3tZ6HQ3X
— ANI (@ANI) August 15, 2021
ఎర్రకోటకు చేరకున్న ప్రధాని మోడీ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు.
Delhi | Prime Minister Narendra Modi inspects the guard of honour at Red Fort pic.twitter.com/Y2tMYsFQ62
— ANI (@ANI) August 15, 2021
75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటకు చేరుకున్నారు. ఆయనకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అజయ్ భట్, రక్షణశాఖ కార్యదర్శి స్వాగతం పలికారు
Delhi | Defence Minister Rajnath Singh, MoS Defence Ajay Bhatt and Defence Secretary Dr Ajay Kumar receive Prime Minister Narendra Modi at Red Fort pic.twitter.com/QvqinS7kmf
— ANI (@ANI) August 15, 2021
75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. తన నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు.
Defence Minister Rajnath Singh hoists the national flag on the 75th #IndependenceDay at his residence in Delhi pic.twitter.com/Uql4S1r3gD
— ANI (@ANI) August 15, 2021
75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తన నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు.
Union Minister for Culture & Tourism G Kishan Reddy hoists national flag at his residence on India’s 75th #IndependenceDay
“Many events will take place across nation during ‘Azadi ka Amrit Mahotsav’ celebrations. India should become corruption-free, poverty-free by 2047,”he says pic.twitter.com/BAaWN8Ycdd
— ANI (@ANI) August 15, 2021
75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ మొదటగా.. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌కు చేరుకుని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.
Delhi | PM Narendra Modi pays tribute to Mahatma Gandhi at Rajghat on the 75th Independence Day
(Photo source: DD News) pic.twitter.com/n9sybFSV1f
— ANI (@ANI) August 15, 2021
75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోటపై ఉదయం 7.30గంటలకు జెండా ఆవిష్కరించనున్నారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.
75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకుల సందర్భంగా.. విజయవాడలో ఉదయం 9.30 నిమిషాలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జెండా ఎగురవేయనున్నారు.
75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకుల సందర్భంగా.. గోల్కోండ కోటపై ఉదయం 10.30 నిమిషాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జెండా ఎగురవేయనున్నారు.
స్వాత్రంత్ర్య దినోత్స వేడుకల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో అలెర్ట్ ప్రకటించారు. భారీ భద్రతతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఎర్రకోట సహా పలు ప్రాంతాల్లో ఐదువేల మంది పోలీసులను మోహరించారు.
75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో దేశ ప్రజలలో కొత్త శక్తి, కొత్త చైతన్యం రావాలి.. జైహింద్.. అంటూ ప్రధాని మోదీ ట్విట్ చేశారు.
ఎర్రకోట వద్ద జరిగే 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు.. టోక్యో ఒలింపిక్స్ విజేతలకు ఆహ్వానం అందించారు. 32 మంది టోక్యో ఒలింపిక్స్ విజేతలను ప్రధాని మోదీ అభినందించనున్నారు.
స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీ ఉదయం 7.30 నిమిషాలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ఆయన త్రివిధ దళలా గౌరవ వందనాన్ని స్వీకరించనున్నారు.