Karnataka Election: ఒక్క నామినేషన్‌కే.. అధికారుల ఒళ్లు హూనమైంది.. రెండు గంటలపాటు.. వీడియో

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. నామినేషన్‌ వేసేందుకు ఒక ఇండిపెండెంట్‌ అభ్యర్థి చేసిన ప్రయత్నం ఎన్నికల అధికారులను రెండు గంటల పాటు గుక్కతిప్పుకోకుండా చేసింది. నామినేషన్లు స్వీకరించే సిబ్బంది ఒళ్లు హునమైంది.

Karnataka Election: ఒక్క నామినేషన్‌కే.. అధికారుల ఒళ్లు హూనమైంది.. రెండు గంటలపాటు.. వీడియో
Karnataka Election

Updated on: Apr 19, 2023 | 1:56 PM

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. నామినేషన్‌ వేసేందుకు ఒక ఇండిపెండెంట్‌ అభ్యర్థి చేసిన ప్రయత్నం ఎన్నికల అధికారులను రెండు గంటల పాటు గుక్కతిప్పుకోకుండా చేసింది. నామినేషన్లు స్వీకరించే సిబ్బంది ఒళ్లు హునమైంది. కర్నాటకలోని యాద్గిర్‌‌ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు యంకప్ప. నామినేషన్‌ కోసం ఆయన పదివేల రూపాయల డిపాజిట్‌ మొత్తాన్ని ఎన్నికల అధికారులకు అందజేశారు. ఆ మొత్తం అంతా రూపాయి కాయిన్సే. ఈ మొత్తాన్ని కూడా అతను నియోజకవర్గంలోని ఓటర్ల నుంచే సేకరించారు. ఒక్క రూపాయి ఇవ్వండి, ఆ తర్వాత ఓటువేయండి. నేను పేదరికం నుంచి మీకు విముక్తి కల్పిస్తానని యంకప్ప ఓటర్లకు హామీ ఇచ్చి పదివేల మొత్తాన్ని సేకరించారు. ఈ పదివేల కాయిన్స్‌ను లెక్కపెట్టడానికి ఎన్నికల సిబ్బందికి దాదాపు రెండు గంటలు పట్టింది. గుల్బార్గా యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసిన యంకప్ప తనకు 60 వేల ఆస్తులున్నాయని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. బసవేశ్వర, కనకదాస, స్వామి వివేకానందా, అంబేడ్కర్‌ తనకు రోల్‌ మోడల్స్‌ అని ఓటర్లకు యంకప్ప చెప్తున్నారు.

వీడియో చూడండి..

బొమ్మై, సిద్ధరామయ్య నామినేషన్..

ఇదిలాఉంటే.. కర్నాటకలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. షిగావ్‌ నియోజకవర్గంలో నామినేషన్‌ వేశారు సీఎం బస్వరాజ్‌ బొమ్మై. ఈ సందర్భంగా షిగావ్‌లో రోడ్‌షో నిర్వహించారు బీజేపీ నేతలు . బస్వరాజ్‌ బొమ్మై నామినేషన్‌ కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కన్నడ స్టార్‌ ‌ కిచ్చా సుదీప్‌ హాజరయ్యారు. అంతకుముందు నడ్డాతో భేటీ అయ్యారు సుదీప్‌. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రకటించిన స్టార్‌ క్యాంపేనర్లలో సుదీప్‌ కూడా ఉన్నారు. మొత్తం 40 మందిని బీజేపీ స్టాక్‌ క్యాంపేనర్లుగా ప్రకటించింది. తెలంగాణ బీజేపీ నేత డీకే అరుణ కూడా స్టార్‌ క్యాంపేనర్ల జాబితాలో ఉన్నారు.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత , మాజీ సీఎం సిద్దరామయ్య కూడా నామినేషన్‌ దాఖలు చేశారు. వరుణ నియోజకవర్గంలో ఆయన నామినేషన్‌ వేశారు. అంతకుముందు మైసూర్‌ చాముండేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..