మీరు ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేశారా..? అయితే మీకు ఇదే చివ‌రి గ‌డువు.. లేక‌పోతే..

|

Dec 25, 2020 | 10:50 AM

2019-20కి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31, 2020. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయనివారు వెంటనే...

మీరు ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేశారా..? అయితే మీకు ఇదే చివ‌రి గ‌డువు.. లేక‌పోతే..
Follow us on

2019-20కి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31, 2020. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయనివారు వెంటనే దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ గడువు తేదీ ముగిసిపోతే అపరాధ రుసుముతో చేయాల్సి ఉంటుంది. పన్ను చెల్లించినా, చెల్లించకపోయినా రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే రిఫండ్ కోరేవారు తప్పనిసరిగా గడువు తేదీ లోపలే రిటర్నులు దాఖలు చేయాలి. ఉద్యోగులు కొన్ని సందర్భాలలో సెక్షన్ 80సీ మినహాయింపులు క్లెయిం చేసుకోలేకపోవచ్చు. ఇలాంటి వారు రిటర్నుల సందర్భంగా వీటిని పేర్కొనాల్సి ఉంటుంది.

జీవిత, ఆరోగ్య బీమా, ప్రీమియం, ఇంటి అద్దె, గృహరుణం వడ్డీ, అసలు చెల్లింపులు, పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్ లో పిల్లల ట్యూషన్ ఫీజులు తదితరాలు అన్నీ కూడా ఫారం-16లో వచ్చాయా లేదా అనే విషయాన్ని చూసుకోవాలి. ఫిక్స్ డ్ డిపాజిట్ల నుంచి వడ్డీ, ఇతర ఆదాయాలు ఉంటే వాటిని పేర్కొనాలి. అలాగే రిటర్నులు దాఖలు చేసే సమయంలో మీ బ్యాంకు ఖాతా వివరాలు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే రిటర్నులు సమర్పించడంతో పాటు దానిని ఇ-వెరిఫికేషన్ చేయడం తప్పనిసరి. సకాలంలో ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడం ద్వారా అపరాధ రుసుము నుంచి కాపాడుకోవచ్చు.

Pan card: కార్డు వినియోగ‌దారుల‌కు గుడ్‌న్యూస్‌‌: కేవ‌లం 10 నిమిషాల్లోనే పాన్ కార్డు పొందండిలా..