AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi earthquake: ఢిల్లీలో భూకంపం.. ఒక్క‌సారిగా ఆందోళ‌న‌కు గురైన ప్ర‌జ‌లు.. అధికారులు ఏం చెప్పారంటే..

ఉత్త‌ర భార‌త‌దేశంలో వ‌రుస భూకంపాలు చోటు చేసుకుంటున్నాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో శుక్ర‌వారం ఉద‌యం మ‌రోసారి భూ ప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. నంగ‌లోయి ప్రాంతంలో ....

Delhi earthquake: ఢిల్లీలో భూకంపం.. ఒక్క‌సారిగా ఆందోళ‌న‌కు గురైన ప్ర‌జ‌లు.. అధికారులు ఏం చెప్పారంటే..
Subhash Goud
|

Updated on: Dec 25, 2020 | 10:23 AM

Share

ఉత్త‌ర భార‌త‌దేశంలో వ‌రుస భూకంపాలు చోటు చేసుకుంటున్నాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో శుక్ర‌వారం ఉద‌యం మ‌రోసారి భూ ప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. నంగ‌లోయి ప్రాంతంలో భూమి స్వ‌ల్పంగా కంపించింది. భూకంప తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేలుపై 2.3గా న‌మోదైన‌ట్లు నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సీస్మోల‌జీ (ఎన్‌సీఎస్‌) తెలిపింది. నంగ‌లోయితోపాటు ఢిల్లీ ఎన్సీఆర్‌, నోయిడా, ఘ‌జియాబాద్ ప్రాంతాల్లో కూడా భూప్ర‌కంప‌న‌లు సంభ‌వించిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. భూమి కపించ‌డంతో ఇళ్ల‌ల్లో ఉన్న ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గురై బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. ఈ భూకంపం కార‌ణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని అధికారులు వెల్ల‌డించారు.

అసోంలోని నౌగామ్‌లో నిన్న ఉద‌యం భూకంపం సంభ‌వించింది. ఉద‌యం ఏడు గంట‌ల ప్రాంతంలో3.0 తీవ్ర‌త‌తో భూమి కంపించింది. భూ అంత‌ర్భాగంలో ఐదు కిలోమీట‌ర్ల లోతులో భూ క‌ద‌లిక‌లు సంభ‌వించ‌డంతో భూకంపం వ‌చ్చింద‌ని ఎన్‌సీఎస్ తెలిపింది. అలాగే ఈ నెల 17వ తేదీన ఢిల్లీ ప‌రిస‌ర ప్రాంతాల్లో భూమి కంపించింది. దీని తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేలుపై 4.2గా న‌మోదైంది. అలాగే రాజ‌స్థాన్‌లోని అల్వార్ ప్రాంతంలోనూ రాత్రి భూకంపం సంభ‌వించింది. ఇలా ఈ మ‌ధ్య కాలంలో ఢిల్లీల‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల్లోనూ ‌వ‌రుస భూప్ర‌కంప‌న‌లు చోటు చేసుకోవ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న చెందుతున్నారు. ఢిల్లీ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఏ స‌మ‌యంలో భూప్ర‌కంప‌న‌లు సంభ‌విస్తాయోన‌ని భ‌యాందోళ‌న చెందుతున్నారు.

Pan card: కార్డు వినియోగ‌దారుల‌కు గుడ్‌న్యూస్‌‌: కేవ‌లం 10 నిమిషాల్లోనే పాన్ కార్డు పొందండిలా..

Follow Us
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..